Russia – Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ వార్‌లో కీలక పరిణామం.. స్నేక్ ఐల్యాండ్ విషయంలో పోటాపోటీ ప్రకటనలు..!

|

Jul 01, 2022 | 7:51 AM

Russia - Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ వార్‌లో కీలక పరిణామం. కీలక స్నేక్‌ ఐల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంది జెలెన్‌స్కీ సేన.

Russia - Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ వార్‌లో కీలక పరిణామం.. స్నేక్ ఐల్యాండ్ విషయంలో పోటాపోటీ ప్రకటనలు..!
Russia Vs Ukraine
Follow us on

Russia – Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ వార్‌లో కీలక పరిణామం. కీలక స్నేక్‌ ఐల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంది జెలెన్‌స్కీ సేన. కీలకమైన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది రష్యా. మరోవైపు యుద్ధం సాగినన్ని రోజులు ఉక్రెయిన్‌కి సాయం చేస్తూనే ఉంటామని ప్రకటించారు అమెరికా అద్యక్షుడు బైడెన్‌.

కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ భారీగా నష్టపోయింది. ఐతే ఉక్రెయిన్‌కు అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు సాయమందిస్తున్నాయి. దీంతో చిన్న దేశమైనా పుతిన్‌ సేనలను ధీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్‌ సైన్యం. తాజాగా ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యూహాత్మక ప్రదేశంగా చెప్పుకుంటున్న నల్లసముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌ నుంచి వైదొలిగింది రష్యా. అటు ఉక్రెయిన్‌ కూడా దీన్ని నిర్థారించింది. ఉక్రెయిన్ ఓడరేవులను దిగ్భంధించి, ధాన్యం ఎగుమతులను అడ్డుకుంటూ ప్రపంచ ఆహార సంక్షోభానికి రష్యా కారణమవుతోందన్న ఆరోపణల నేపథ్యంలోనే స్నేక్‌ ఐలాండ్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. కానీ రష్యాను తామే తరిమికొట్టామని ఉక్రెయిన్‌ చెప్పుకుంటోంది. తమ సైనికులు వీరోచితంగా పోరాడి స్నేక్‌ ఐలాండ్‌ను కాపాడుకున్నారంటోంది ఉక్రెయిన్‌.

ఇదిలాఉంటే.. యుద్ధం కొన‌సాగిన‌న్ని రోజులు ఉక్రెయిన్‌కి సాయం చేస్తూనే ఉంటామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఇంకా ఉక్రెయిన్‌కు ఎన్ని రోజులు సాయమందిస్తాయన్న అనుమానాల నేపథ్యంలో స్పష్టతనిచ్చారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు. యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు కొన‌సాగుతుందో చెప్పలేన‌ని..కానీ ర‌ష్యా చేతిలో ఉక్రెయిన్ ఓడిపోద‌ని చెప్పారు. ఐతే ఉక్రెయిన్‌లోని ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించాల‌ని పుతిన్ భావిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అభిప్రాయ‌ప‌డింది. ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధంలో ర‌ష్యా ద‌ళాలు బ‌ల‌హీన‌ప‌డినా.. స్వల్ప స్థాయిలో ఆ బ‌ల‌గాలు ముందుకు క‌దులుతున్నట్లు అంచ‌నా వేశారు. దీని ఆధారంగా ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం ఎక్కువ కాలం కొన‌సాగే అవ‌కాశముందంటున్నారు.