‘ ఆపరేషన్ కైలా ముల్లెర్ ‘ పేరిట.. బాగ్దాదీ హతం !

|

Oct 29, 2019 | 4:15 PM

26 ఏళ్ళ కైలా ముల్లెర్ అమెరికాలోని ఆరిజోనా నివాసి. ఓ ఛారిటీ సంస్థలో పని చేసే ఆమె ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు, సిరియాలో కిడ్నాపర్ల చెరలో బందీలుగా ఉన్న మహిళలను రక్షించేందుకు టర్కీ నుంచి అలెప్పీ వెళ్తుండగా సిరియా సరిహద్దుల్లో ఐసిస్ కిడ్నాపర్ల చేతికి తానే చిక్కింది. 2013 లో జరిగిందీ ఘటన.. ఆ తరువాత ముల్లెర్ మళ్ళీ కనబడలేదు. ఐసిస్ చీఫ్ బాగ్దాదీ అంతం కావడానికీ ఈమెకు మధ్య ఓ లింక్ ఉంది. గతంలోకి […]

 ఆపరేషన్ కైలా ముల్లెర్  పేరిట.. బాగ్దాదీ హతం !
Follow us on

26 ఏళ్ళ కైలా ముల్లెర్ అమెరికాలోని ఆరిజోనా నివాసి. ఓ ఛారిటీ సంస్థలో పని చేసే ఆమె ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు, సిరియాలో కిడ్నాపర్ల చెరలో బందీలుగా ఉన్న మహిళలను రక్షించేందుకు టర్కీ నుంచి అలెప్పీ వెళ్తుండగా సిరియా సరిహద్దుల్లో ఐసిస్ కిడ్నాపర్ల చేతికి తానే చిక్కింది. 2013 లో జరిగిందీ ఘటన.. ఆ తరువాత ముల్లెర్ మళ్ళీ కనబడలేదు. ఐసిస్ చీఫ్ బాగ్దాదీ అంతం కావడానికీ ఈమెకు మధ్య ఓ లింక్ ఉంది. గతంలోకి వెళ్తే.. నాడు తమకు బందీలుగా చిక్కిన యువతులను బాగ్దాదీ, అతని సహచరులు వదిలేవారు కారు. అలాగే తాము పట్టుకున్న ముల్లెర్ పై బాగ్దాదీ అత్యాచారం చేస్తూ ఆమెను టార్చర్ పెట్టేవాడట. అతని డెన్ లో ఆమె దాదాపు 18 నెలలు బందీగా ఉంది. చివరకు 2015 లో ముల్లెర్ ను బాగ్దాదీ సహచరులు హతమార్చారు. సిరియాలో జరిగిన అంతర్యుధ్ధంలో శరణార్థులకు సేవ చేసేందుకు వెళ్లిన ముల్లెర్ కథ అలా విషాదాంతమైంది. ఆమె మృతదేహం ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో యుఎస్ సైనిక దళాలు బాగ్ధాదీని అంతమొందించడంతో.. ఆరిజోనాలోని ఆమె తలిదండ్రులు మార్షా ముల్లెర్, కార్ల్ ముల్లెర్ సంతోషం వ్యక్తం చేశారు. ట్రంప్ మాదిరే నాడు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కఠిన నిర్ణయం తీసుకుని ఉంటే బహుశా ఈనాడు తమ కూతురు బతికి ఉండేదేమో అంటున్నారు. ట్రంప్ చర్యపట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురు మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు తాము రహస్యంగా సిరియా వెళ్లినా ఫలితం లేకపోయిందని అన్నారు.
తాజాగా ట్రంప్.. కైలా సాహసాన్ని ప్రశంసించాడు. ఆమెకు జరిగిన ఘోర అన్యాయానికి బాగ్దాదీకి తగిన శాస్తి జరిగిందని అన్నాడు. ఐసిస్ నేతను అంతమొందించిన ఘటనను తాము ‘ ఆపరేషన్ ముల్లెర్ ‘ పేరిట వ్యవహరిస్తున్నామని ఆయన అభివర్ణించాడు.