ISI Chief: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ తొలగింపు.. కారణం అదేనా?

|

Oct 06, 2021 | 9:19 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌లకు బలమైన పాలనను స్థాపించడంలో సహాయపడిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ ను ఆ పదవి నుండి తొలగించారు.

ISI Chief: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ తొలగింపు.. కారణం అదేనా?
Pakistan Isi Chief Fais
Follow us on

ISI Chief: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌లకు బలమైన పాలనను స్థాపించడంలో సహాయపడిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ ను ఆ పదవి నుండి తొలగించారు. మీడియా నివేదికల ప్రకారం, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటే ఐఎస్ఐ (ISI) చీఫ్ ఫైజ్ గత నెలలో ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆమోదం తీసుకోకుండా కాబూల్ వెళ్లారు. అక్కడ, తాలిబాన్ నాయకులతో పాటు, సెరెనా హోటల్‌లో టి-పార్టీకి హాజరయ్యారు. అక్కడ తాలిబాన్ పాలనను స్థాపించడానికి ఆయన సహాయం చేశారని ఆరోపణలు వచాయి. నిజానికి జనరల్ ఫైజ్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆప్తుడు. ఈయన వచ్చే ఏడాది ఆర్మీ చీఫ్ అవ్వాల్సి ఉంది. జనరల్ బజ్వాతో పాటు, అమెరికా కూడా ఆయన కాబూల్ సందర్శనతో చాలా కోపంగా ఉందని చెబుతారు.  ఇప్పుడు ఫైజ్ హమీద్ స్థానంలో జనరల్ నదీమ్ అంజుమ్ ఐఎస్ఐ కొత్త చీఫ్‌గా ఉంటారు.

చాలా కాలంగా..

జనరల్ హమీద్ తొలగింపు వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి, కానీ సైన్యం ఆధిపత్యం కారణంగా, పాకిస్తాన్ ప్రధాన మీడియా ఈ నివేదికలను అణిచివేస్తోంది. హమీద్‌ను పెషావర్ కార్ప్స్ కమాండర్ చీఫ్‌గా పంపారు. ఆర్మీ చీఫ్ కూడా ఉన్నత స్థాయిలో కొన్ని ఇతర మార్పులు చేశారు. జనరల్ హమీద్ అలాగే  బజ్వా మధ్య తగాదా వార్తలు చాలా కాలంగా వెలుగులోకి వస్తున్నాయనేది  కూడా నిజం. రావల్పిండిలోని ఆర్మీ హౌసింగ్ ప్రాజెక్ట్ విషయంలో మూడేళ్ల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. తరువాత, ఇమ్రాన్ బజ్వాకు మూడేళ్ల పొడిగింపు ఇచ్చినప్పుడు, ఈ టగ్ ఆఫ్ వార్  బహిర్గతం అయింది. బజ్వాను విశ్వాసంలోకి తీసుకోకుండా ఫైజ్ చాలాసార్లు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు.

ఇమ్రాన్ నిర్ణయించుకోవలసి వచ్చింది..

ప్రధాన మంత్రికి ఐఎస్ఐ చీఫ్  నినియమించే అధికారం ఉంది. అందుకే  ఇమ్రాన్ ఫైజ్‌ని చీఫ్ గా  చేసాడు  ఆయనే అతనిని తలగించారు.  ప్రత్యేక విషయం ఏమిటంటే, ఆర్మీ చీఫ్ సలహా మేరకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల, బజ్వా సలహా మేరకు జనరల్ హమీద్ ను తొలగించి ఉండవచ్చని  చెప్పవచ్చు. అయితే, ఇమ్రాన్ ఫైజ్‌ను తొలగించడానికి అనుకూలంగా లేరు అని అక్కడి మీడియా చెబుతోంది. 

పాకిస్తాన్‌లోని కొంతమంది జర్నలిస్టులు ఈ విషయంలో అమెరికా కోణం ఉందని నమ్ముతారు. నిజానికి, ఫైజ్ కాబూల్ సందర్శన, తాలిబాన్ నాయకులతో భేటీ కావడం బిడెన్ పరిపాలనకు విసుగు తెప్పించింది. వైట్ హౌస్ జనరల్ ఫైజ్ ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఓటమిని తాలిబాన్ నాయకులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్నట్లు అనిపించింది.

హమీద్ ఎలా చిక్కుకున్నాడు?

ఆగస్టు 15 న, తాలిబాన్లు కాబూల్‌తో సహా దాదాపు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ సైన్యం ఐఎస్ఐ తాలిబాన్లకు అన్ని విధాలుగా సహాయపడుతున్నాయని ప్రపంచం ఇప్పటికే అనుమానించింది. సెప్టెంబర్ ప్రారంభంలో, జనరల్ ఫైజ్ హమీద్ నిశ్శబ్దంగా కాబూల్ వచ్చారు. ఇక్కడ ఒకే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. దాని పేరు సెరెనా హోటల్. ఇక్కడ అతను తన చేతిలో టీ కప్పుతో అగ్రశ్రేణి తాలిబాన్ నాయకులతో చాట్ చేస్తూ కనిపించరు.  యాదృచ్ఛికంగా, బ్రిటన్ నుండి ఒక మహిళా జర్నలిస్ట్ ఈ హోటల్‌లో ఉన్నారు. ఆమె ఫైజ్ ఫోటోలను తీయడమే కాకుండా కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది. ప్రతిస్పందనగా, ఫైజ్ అంతా బాగుంది అని చెప్పాడు. ఇక్కడ నుండి ఈ వార్త అగ్నిలా వ్యాపించింది. హమీద్‌తో బాజ్వా,అమెరికా కలత చెందాయి. అతడిని తొలగించాలని ఇమ్రాన్ పై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.

Also Read: Reliance Jio network down: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ డౌన్‌.. ఇబ్బందులు పడ్డ వినియోగదారులు..!

Windows 11: విండోస్ 11 వచ్చేసింది.. దీనిని మీ కంప్యూటర్ లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చంటే..