మెగన్ మార్క్ లె బిడ్డకు ఇండియన్ టవల్

|

Jul 30, 2019 | 5:09 PM

బ్రిటిష్ రాచరిక కుటుంబంలోని మెగన్ మార్క్ లె తన ముద్దుల చిన్నారి ఆర్చీకి భారతీయ టవల్ కప్పి.. భారత దేశంపట్ల తన అభిమానాన్ని చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎరవాన్ కాటన్ దోహార్ గా ఈ పెద్ద టవల్ ని వ్యవహరిస్తారు. హాంకాంగ్ లోని మలబార్ బేబీ బ్రాండ్ వస్త్రాలను ఉత్పత్తి చేసే సంస్థ.. రాజస్థాన్.. జైపూర్ దగ్గరి ఓ గ్రామంలో గల టెక్స్ టైల్ ఫ్యాక్టరీతో లింక్ పెట్టుకుని .. ఇక్కడి వస్త్రాలను కొనుగోలు చేస్తుంది. అవి […]

మెగన్ మార్క్ లె  బిడ్డకు ఇండియన్ టవల్
Follow us on

బ్రిటిష్ రాచరిక కుటుంబంలోని మెగన్ మార్క్ లె తన ముద్దుల చిన్నారి ఆర్చీకి భారతీయ టవల్ కప్పి.. భారత దేశంపట్ల తన అభిమానాన్ని చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎరవాన్ కాటన్ దోహార్ గా ఈ పెద్ద టవల్ ని వ్యవహరిస్తారు. హాంకాంగ్ లోని మలబార్ బేబీ బ్రాండ్ వస్త్రాలను ఉత్పత్తి చేసే సంస్థ.. రాజస్థాన్.. జైపూర్ దగ్గరి ఓ గ్రామంలో గల టెక్స్ టైల్ ఫ్యాక్టరీతో లింక్ పెట్టుకుని .. ఇక్కడి వస్త్రాలను కొనుగోలు చేస్తుంది. అవి హాంకాంగ్ నుంచి లండన్ కు ఎగుమతి అవుతాయి. ఈ నేపథ్యంలో.. ఓ విదేశీ వెబ్ సైట్ జర్నలిస్టులు జైపూర్ సమీపంలోని ఈ గ్రామంలో గల ‘ నయికా ‘ ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు అక్కడి వర్కర్లు తాము తయారు చేసే శాలువాలు, టవల్స్ తదితర వస్త్రాలను చూపారు. నెలకు కేవలం 6 వేల జీతంపై తాము పనిచేస్తామని, కానీ తమ కష్టానికి ఇది ఏ మాత్రం చాలడంలేదని అరుణ రెగర్ అనే కార్మికురాలు తెలిపింది. మీరు తయారు చేస్తున్న వస్త్రాలు లండన్ కు కూడా చేరుతున్నాయని చెప్పినప్పుడు ఆమె ఆశ్ఛర్యపోయింది. అక్కడ వీటికి పలికే ధర తెలిసి షాక్ కి గురయింది. తాము పగలనక, రేయనక కష్టపడి వీటిని తయారు చేస్తే వీటికి ఈ దేశంలో తక్కువధరకు అమ్ముతారని, కానీ బ్రిటన్ వంటి దేశాల్లో వీటి ధరలు ఇంతగా ఉంటాయని తాము భావించలేదని ఆమె తెలిపింది. కాగా-తమ వస్త్రాలకు లండన్ లో డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా 2 వేల ఆర్దర్లు వచ్చాయని నయికా ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆనందంతో చెబుతున్నారు.