కొత్తలెక్క.. అమెజాన్‌ అధిపతి ఆస్తి ఎంతంటే..

|

Aug 27, 2020 | 4:53 PM

అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో ఒక చిన్న గ్యారేజీలో పుస్తకాలను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రారంభమైన ఈకామర్స్‌ కంపెనీ అమెజాన్‌. దీని అధిపతి జెఫ్‌ బెజోస్..

కొత్తలెక్క.. అమెజాన్‌ అధిపతి ఆస్తి ఎంతంటే..
Follow us on

అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో ఒక చిన్న గ్యారేజీలో పుస్తకాలను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రారంభమైన ఈకామర్స్‌ కంపెనీ అమెజాన్‌. దీని అధిపతి జెఫ్‌ బెజోస్‌. తాజాగా కట్టిన లెక్కల ప్రకారం మన భారత రూపాయిల్లో అతని ఆస్తి అక్షరాలా 15 లక్షల కోట్లకుపైనే. ఇది ఒక రికార్డు. ఇప్పటికే ప్రపంచ కుబేరుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న 56 ఏళ్ల బెజోస్.. వ్యక్తిగత సంపద బుధవారానికి 200 బిలియన్‌ డాలర్లను దాటింది. ఫలితంగా తొలిసారి 200 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదను సాధించిన రికార్డును బెజోస్‌ సొంతమైంది.

ఇక ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో రెండో ర్యాంకులో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ సంపద 116.1 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా.. బెజోస్‌ సంపద 204.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. కరోనా కష్టకాలంలోనూ అమెజాన్‌ షేరు 80 శాతం దూసుకెళ్లడం విశేషం. దీంతో అమెజాన్‌లో 11 శాతం వాటా కలిగిన కంపెనీ ప్రమోటర్‌ జెఫ్‌ బెజోస్‌ తాజా ఫీట్‌ను సాధించగలిగారు. బెజోస్‌కు అమెరికన్‌ దినపత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌, వైమానిక కంపెనీ బ్లూ ఒరిజిన్‌ తదితరాలలో కూడా పెట్టుబడులున్నాయి.