ఎలుగుబంటి గుహలో..నెల పాటు.. షాకింగ్ వీడియో

|

Jun 27, 2019 | 3:33 PM

రష్యా, మంగోలియా సరిహద్దుల్లోని తువా ప్రాంతమది ! అక్కడి దట్టమైన అటవీ ఏరియాలో ఇటీవల తమతో వేటకుక్కలను తీసుకుని వేటకు బయల్దేరారు కొందరు హంటర్లు. వేటాడుతుండగా వారి కుక్కలు హఠాత్తుగా ఓ గుహలోకి దారి తీసి అక్కడే మొరుగుతూ నిల్చుండిపోయాయి. హంటర్లు ఆ గుహలోకి వెళ్లిచూసేసరికి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఓ వ్యక్తి అచ్ఛు శవంలా, మమ్మి ఫైడ్ బాడీ షేప్ లో అపస్మారక స్థితిలో కనిపించాడు. ఒళ్ళంతా గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న అతడ్ని […]

ఎలుగుబంటి గుహలో..నెల పాటు.. షాకింగ్ వీడియో
Follow us on

రష్యా, మంగోలియా సరిహద్దుల్లోని తువా ప్రాంతమది ! అక్కడి దట్టమైన అటవీ ఏరియాలో ఇటీవల తమతో వేటకుక్కలను తీసుకుని వేటకు బయల్దేరారు కొందరు హంటర్లు. వేటాడుతుండగా వారి కుక్కలు హఠాత్తుగా ఓ గుహలోకి దారి తీసి అక్కడే మొరుగుతూ నిల్చుండిపోయాయి. హంటర్లు ఆ గుహలోకి వెళ్లిచూసేసరికి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఓ వ్యక్తి అచ్ఛు శవంలా, మమ్మి ఫైడ్ బాడీ షేప్ లో అపస్మారక స్థితిలో కనిపించాడు. ఒళ్ళంతా గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న అతడ్ని చూసి..మొదట మరణించిన వ్యక్తిగా పొరబడినా..చివరకు బతికే ఉన్నట్టు తెలుసుకున్నారు. వారిని చూసి అతి కష్టం మీద కళ్ళు తెరిచిన ఆ వ్యక్తి తన పేరు అలెగ్జాండర్ అని మాత్రం చెప్పగలిగాడు. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఓ ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇతడ్ని ఆ ఎలుగు తన గుహలో వదిలి వెళ్లిందని, ఏదో ఒకరోజున ఆహారంగా తిందామనుకుందని భావిస్తున్నామని ఈ వేటగాళ్లలో కొందరు తెలిపారు. ఈ జాతి ఎలుగులు తమ ‘ ఎర ‘ శరీరం పూర్తిగా ఎండిపోయాక.. అప్పుడు భక్షిస్తాయట. అయితే ఈ వ్యక్తి సుమారు నెలరోజులుగా ఈ గుహలో కదలలేక పడివున్నాడు. ఇంతకాలం తన యూరిన్ ని తాగి ప్రాణాలు నిలుపుకున్నాడని హంటర్లు తెలిపారు. కాగా-హాలీవుడ్ నటుడు లియోనార్డో డీ కాప్రియో నటించిన ‘ రెవనెంటో ‘ చిత్రంలో ఎలుగు దాడికి గురైనప్పటికీ బతికి ఉన్న వ్యక్తి పాత్ర గుర్తుకు రావడం లేదూ అంటున్నారు ఈ వైనం తెలిసినవాళ్ళు .