గాయపడిన శునకం..ఫార్మసిస్ట్ వైద్యం.. వీడియో వైరల్

|

Jun 25, 2019 | 4:24 PM

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిందో విచిత్రం. కాలికి గాయమై రక్తమోడుతున్న ఓ వీధికుక్క నేరుగా ఓ మందుల షాపులో ప్రవేశించింది. బాను సెంగిజ్ అనే ఫార్మసిస్ట్ నిర్వహిస్తున్న ఈ మెడికల్ షాపులో ఎంటరయిన ఈ శునకం.. జాలిగా ఆమెకేసి చూస్తూ డోర్ దగ్గరే నిలబడిపోయింది. జంతు ప్రేమికురాలు కూడా అయిన సెంగిజ్.. ఆ శునకానికి వెంటనే చికిత్స చేసింది. ఆ జాగిలం కాలిని యాంటీసెప్టిక్ తో శుభ్రం చేసి.. యాంటీ బయోటిక్స్ ను కూడా ఇచ్చింది. […]

గాయపడిన శునకం..ఫార్మసిస్ట్ వైద్యం.. వీడియో వైరల్

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిందో విచిత్రం. కాలికి గాయమై రక్తమోడుతున్న ఓ వీధికుక్క నేరుగా ఓ మందుల షాపులో ప్రవేశించింది. బాను సెంగిజ్ అనే ఫార్మసిస్ట్ నిర్వహిస్తున్న ఈ మెడికల్ షాపులో ఎంటరయిన ఈ శునకం.. జాలిగా ఆమెకేసి చూస్తూ డోర్ దగ్గరే నిలబడిపోయింది. జంతు ప్రేమికురాలు కూడా అయిన సెంగిజ్.. ఆ శునకానికి వెంటనే చికిత్స చేసింది. ఆ జాగిలం కాలిని
యాంటీసెప్టిక్ తో శుభ్రం చేసి.. యాంటీ బయోటిక్స్ ను కూడా ఇచ్చింది. సాధారణంగా ఈమె నడుపుతున్న మెడికల్ షాపులో ఇలా గాయాలకు గురైన వీధికుక్కల కోసం ప్రత్యేకంగా బెడ్లు కూడా ఉన్నాయట. కానీ ఈ ‘ కుక్కగారు ‘ మాత్రం ఆ బెడ్ల వద్దకు వెళ్లలేదని, చికిత్స తరువాత తనకు కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా కింద పడుకుందని బాను సెంగిజ్ వెల్లడించింది. తన షాపులోని సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేసిన ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా..అది చూసి లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. సెంగిజ్ ఔదార్యాన్ని, జాలిగుణాన్ని పొగడని వాళ్ళు లేరు.

Follow us on