జైలు గోడల మధ్యే ఇక సీరియల్ రేపిస్ట్ ప్రొడ్యూసర్.. ఐదేళ్లా ? పాతికేళ్లా ?

| Edited By: Anil kumar poka

Feb 26, 2020 | 5:53 PM

హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్, రేపిస్ట్ హార్వే వీన్ స్టీన్ ఇక జైలుపక్షి కాక తప్పదు. న్యూయార్క్ శివార్లలోని రైకర్స్ ఐలాండ్ జైల్లో ఆయన.. 8 అడుగుల వైశాల్యం, 10 అడుగుల ఎత్తయిన సెల్ లో ఖైదీ కానున్నాడు.

జైలు గోడల మధ్యే ఇక సీరియల్ రేపిస్ట్ ప్రొడ్యూసర్.. ఐదేళ్లా ? పాతికేళ్లా ?
Follow us on

హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్, రేపిస్ట్ హార్వే వీన్ స్టీన్ ఇక జైలుపక్షి కాక తప్పదు. న్యూయార్క్ శివార్లలోని రైకర్స్ ఐలాండ్ జైల్లో ఆయన.. 8 అడుగుల వైశాల్యం, 10 అడుగుల ఎత్తయిన సెల్ లో ఖైదీ కానున్నాడు. హాలీవుడ్ నిర్మాతగా ఉండగా.. మూవీల్లో ఛాన్సులు ఇప్పిస్తానంటూ.. అనేకమంది మహిళలపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడినట్టు దోషిగా ఇతడ్ని న్యూయార్క్ కోర్టు ప్రకటించిన విషయం విదితమే. 67 ఏళ్ళ హార్వే.. 5 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు జైలుశిక్షను ఎదుర్కోనున్నాడు.  న్యూయార్క్ జ్యూరీ తీర్పు ప్రకటించగానే… ఇద్దరు పోలీసులు అతడి చేతులకు సంకెళ్లు వేసి తమ కస్టడీలోకి తీసుకున్నారు. మార్చి 11 న ఇతడికి ఎంతకాలం శిక్ష వేయాలన్నది కోర్టు నిర్ధారించనుంది. ఒకసారి ఆ జైల్లో ‘లాండ్’

అయ్యాక ఇక ఇతనికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కూడా ఇతడ్ని అనుమతించబోరు. హార్వేని కోర్టు ‘వయొలెంట్ అఫెండర్’ గా ప్రకటించింది. అంటే అత్యంత పటిష్టమైన భద్రతతో కూడిన సెల్ లో నిర్బంధించనున్నారు. అందులో ఒంటరిగానే గడపనున్నాడు.   ఇతర ఖైదీలను కలుసుకునేందుకో, వారితో మాట్లాడేందుకో కూడా హార్వేకి ఛాన్స్ ఉండదు. సుమారు 80 మంది మహిళలు, మోడళ్ళు, నటీమణులు తమపై హార్వే అతి దారుణంగా ప్రవర్తించాడని ఆరోపణలు గుప్పించారు. వీరిలో కొందరు ఈ నెల 24 న కోర్టు బయట….  ఇతనికి కఠిన శిక్ష పడాలంటూ నిరసనకు సైతం దిగారు.