గడ్డ కట్టిన గాలి బుడగలు..కనువిందు చేస్తున్నసరస్సు అందాలు

|

Nov 26, 2019 | 9:16 PM

ఉత్తర చైనా హీలాంగ్జియాంగ్‌ ఫ్రావిన్స్‌లోని మోహేలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 30 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో  లియాన్‌హువా సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరస్సు అడుగుభాగంలో ఉన్న మొక్కల ద్వారా విడుదలయ్యే మీథేన్‌ వాయువు..ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చల్లటి మంచుతో కలిసిపోయి బుడగల రూపంలో కనువిందు చేస్తోంది. వివిధ ఆకారాలతో ఉన్న క్రిస్టల్స్‌-మంచు బుడగలు సరస్సుపై 3వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.  ఈ సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, […]

గడ్డ కట్టిన గాలి బుడగలు..కనువిందు చేస్తున్నసరస్సు అందాలు
Follow us on

ఉత్తర చైనా హీలాంగ్జియాంగ్‌ ఫ్రావిన్స్‌లోని మోహేలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 30 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో  లియాన్‌హువా సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరస్సు అడుగుభాగంలో ఉన్న మొక్కల ద్వారా విడుదలయ్యే మీథేన్‌ వాయువు..ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చల్లటి మంచుతో కలిసిపోయి బుడగల రూపంలో కనువిందు చేస్తోంది. వివిధ ఆకారాలతో ఉన్న క్రిస్టల్స్‌-మంచు బుడగలు సరస్సుపై 3వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.  ఈ సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, ఫొటోగ్రాఫర్లు తరలివెళ్తున్నారు. కెమెరాలు, మొబైల్స్‌లో మంచు అందాలను బంధించి ఎంజాయ్‌ చేస్తున్నారు.