భలే పరిష్కారం ! పెగాసస్ వివాదం.. ఫోన్ను, నెంబరును మార్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్..

| Edited By: Phani CH

Jul 23, 2021 | 10:23 AM

పెగాసస్ స్పై వేర్ వివాదంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ భలే ఉపాయం కనిపెట్టారు. ఆయన తన ఫోన్ ను, నెంబరును కూడా మార్చేశారు. ఆయనకు ఎన్నో ఫోన్ నెంబర్లు ఉన్నాయని, వాటిపైన కూడా నిఘా ఉందనుకోరాదని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు.

భలే పరిష్కారం ! పెగాసస్ వివాదం.. ఫోన్ను, నెంబరును మార్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్..
Emmanuel Macron
Follow us on

పెగాసస్ స్పై వేర్ వివాదంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ భలే ఉపాయం కనిపెట్టారు. ఆయన తన ఫోన్ ను, నెంబరును కూడా మార్చేశారు. ఆయనకు ఎన్నో ఫోన్ నెంబర్లు ఉన్నాయని, వాటిపైన కూడా నిఘా ఉందనుకోరాదని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొత్తగా తీసుకున్న ఫోన్ గానీ, నెంబరుగానీ వీటికి అదనమే అని ఆయన చెప్పారు. ఇది అదనపు సెక్యూరిటీగా ఉపయోగపడుతుందన్నారు. పెగాసస్ బెడదలో అధ్యక్షుని సెక్యూరిటీ ప్రొటొకాల్స్ ని అప్ డేట్ చేసినట్టు గేబ్రియల్ అటల్ అనే ఈ ప్రతినిధి వెల్లడించారు. ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కాగా మొరాకో తమ నేత ఫోన్ పై నిఘా పెట్టిందని రేడియో ఫ్రాన్స్ బ్రాడ్ కాస్టర్ ఆరోపించింది. ప్రముఖుల ఫోన్లకు సంబంధించిన ట్యాపింగ్ లో ఈ నెంబరు కూడా ఉన్నట్టు పేర్కొంది. అయితే దీన్ని నిర్దిష్టంగా చెప్పలేమని కూడా వ్యాఖ్యానించింది. మొరాకో ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ఇది నిరాధారమైన వార్త అని పేర్కొంది. మీరు మొదట ఇజ్రాయెల్ ను సంప్రదించాలని కూడా సూచించింది.

పెగాసస్ వివాదంపై జర్మనీ, హంగరీ కూడా తీవ్రంగా స్పందించాయి. దీనిపై దర్యాప్తు జరగాల్సిందేనని జర్మనీ ఛాన్సలర్ అన్నారు. ఇది ప్రపంచానికి సంబంధించిన సమస్య అని ఏంజెలా మార్కెల్ అభిప్రాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్.. 17 మీడియా ఆర్గనైజేషన్ల ఇన్వెస్టిగేషన్ పై ఆధారపడి ఈ వార్తలను అధ్యయనం చేయడానికి అంతర్ మంత్రివర్గ సంఘాన్ని నియమించింది. ఈ గ్రూప్ సాధ్యమైనంత త్వరలో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పెగాసస్ పై ప్రపంచ వ్యాప్తంగా ఇంత రభస జరుగుతున్నా ఇజ్రాయెల్ లోని ఎన్ఎస్ఓ సంస్థ మాత్రం ఇప్పటికీ ఇవి నిరాధారమైన వార్తలని తోసిపుచ్చుతోంది..ఈ స్పై వేర్ ని ఎవరు వాడారో.. ఆ క్లయింట్లు ఎవరో ఆయా వివరాలు తమకు తెలియవని బుకాయిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం

Tokyo Olympics 2021 Live: ప్రారంభమైన పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్.. పోటీపడుతోన్న ముగ్గురు ప్లేయర్స్!