యూరప్ ను ఉడికిస్తోన్న ఉష్ణోగ్రతలు

| Edited By: Srinu

Jul 01, 2019 | 7:45 PM

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో యూరప్ దేశాలు ఉడికిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఆదివారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా ఏడుగురు చనిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఫ్రాన్స్ చరిత్రలో ఎరుగని 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కాలిఫోర్నియా డెత్ వేలీలో నమోదయ్యే ఉష్ణోగ్రత కన్నా ఎక్కువని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఇక్కడి రహదారుల వెంట రగులుకుంటున్న కార్చిచ్చుల కారణంగా 550 ఎకరాల అడవి దగ్దమవడం కూడా ఇక్కడి […]

యూరప్ ను ఉడికిస్తోన్న ఉష్ణోగ్రతలు
Follow us on

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో యూరప్ దేశాలు ఉడికిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఆదివారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా ఏడుగురు చనిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఫ్రాన్స్ చరిత్రలో ఎరుగని 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కాలిఫోర్నియా డెత్ వేలీలో నమోదయ్యే ఉష్ణోగ్రత కన్నా ఎక్కువని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఇక్కడి రహదారుల వెంట రగులుకుంటున్న కార్చిచ్చుల కారణంగా 550 ఎకరాల అడవి దగ్దమవడం కూడా ఇక్కడి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఓ కారణమని సమాచారం. స్పెయిన్ విషయానికి వస్తే దేశంలోని 40 ప్రాంతాలకు తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణవిభాగం. అందులో 7 ప్రాంతాలు అతి తీవ్రస్థాయిలో ఉండొచ్చని సదరు విభాగం ప్రత్యేకంగా తెలపడం విశేషం. ఇక్కడ కూడా వాతావరణం ఇంత తీవ్రంగా మారడానికి కారణం అడవులు మండిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం కాటలాన్ సిటీలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇది నగర చరిత్రలోనే ప్రథమంగా నిపుణులు చెబుతున్నారు.

ఇంత తీవ్రమైన వాతావరణంలోనూ ఫ్రాంక్ ఫర్ట్ లో జరిగిన మారథాన్ రేసులో 3000 వేలకు అథ్లెట్లు పాల్గొన్నారు. ఎండ ధాటికి తట్టుకోలేక కొందరు ఫినిష్ డ్ లైన్ కు కిలోమీటరు ముందే చేతులెత్తేసారు.  గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఇంతటి తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటున్నారు స్థానికులు. తలపై కోడిగుడ్డును పెట్టుకుంటే ఉడికిపోయే వాతావరణంలో జీవించేదెట్లా అని విచారంలో మునిగిపోతున్నారు. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ నివేదికల మేరకు 2019ని చరిత్రలో అత్యధికవేడిమిని ఎదుర్కోబోయే అయిదు సంవత్సరాలలో మొదటి సంవత్సరంగా చెబుతున్నారు. ఇది ప్రపంచానికి ఓ హెచ్చరిక గుర్తించాలని కోరుతున్నారు. నానాటికీ పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో మరణాలపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. సెయింట్ పీటర్ స్క్వేర్లో హాజరైన వేలాది జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపారు. ప్రపంచ వాతావరణంలో సంభవిస్తోన్న విపరీత మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.