‘ కాశ్మీర్ ‘ తో పామాయిల్ లింక్.. మలేసియాకు ట్రబుల్ !

|

Oct 22, 2019 | 3:16 PM

భారత, మలేసియా దేశాల మధ్య పామాయిల్ వాణిజ్యం తాలూకు ‘ లింక్ ‘ కాశ్మీర్ ఇష్యుతో ముడి పడిఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. మలేసియా నుంచి ఇండియా పెద్ద ఎత్తున పామాయిల్ దిగుమతి చేసుకుంటూ వస్తోంది. దీంతో ఆ దేశ ఆదాయం కూడా భారీగానే పెరిగింది. అయితే ముంబైలోని ఓ ప్రముఖ ఆయిల్ సంస్థ ఇక మలేసియా పామాయిల్ దిగుమతులకు స్వస్తి చెప్పాలని తమ ‘ సహ ‘ సంస్థలను కోరింది. ఇందుకు కాశ్మీర్ సమస్యే కారణం.. […]

 కాశ్మీర్  తో పామాయిల్ లింక్.. మలేసియాకు ట్రబుల్ !
Follow us on

భారత, మలేసియా దేశాల మధ్య పామాయిల్ వాణిజ్యం తాలూకు ‘ లింక్ ‘ కాశ్మీర్ ఇష్యుతో ముడి పడిఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. మలేసియా నుంచి ఇండియా పెద్ద ఎత్తున పామాయిల్ దిగుమతి చేసుకుంటూ వస్తోంది. దీంతో ఆ దేశ ఆదాయం కూడా భారీగానే పెరిగింది. అయితే ముంబైలోని ఓ ప్రముఖ ఆయిల్ సంస్థ ఇక మలేసియా పామాయిల్ దిగుమతులకు స్వస్తి చెప్పాలని తమ ‘ సహ ‘ సంస్థలను కోరింది. ఇందుకు కాశ్మీర్ సమస్యే కారణం.. జమ్మూ కాశ్మీర్ పై ఇండియా దురాక్రమణ చేసిందని, ఆ రాష్ట్రాన్ని ఆక్రమించిందని ఆ దేశ ప్రధాని మహాతిర్ మహమ్మద్ గత నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఆరోపించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ఆ సందర్భంగా గళం కలిపిన ఆయన.. తాను కూడా ఆ కోవలోనే వాడినని నిరూపించుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో ఇండియా ఇక ఆ దేశం నుంచి ఈ ఆయిల్ దిగుమతి చేసుకోరాదని, ఇందుకు బదులుగా ఇండోనేసియా వంటి దేశాలే బెటరని అభిప్రాయపడింది. నిజానికి మలేసియా నుంచి భారత్.. జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 200 కోట్ల బిలియన్ డాలర్ల విలువైన సుమారు 3.9 టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంది. అయితే భారత ప్రభుత్వ నిర్ణయంతో ఆ దేశ వాణిజ్య లోటు పెరిగిపోయింది. ముంబైలోని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా దీనిపై స్పందిస్తూ. ప్రస్తుతానికి మలేసియా నుంచి పూర్తిగా పామాయిల్ దిగుమతులకు స్వస్తి చెబుతున్నామని ప్రకటించింది. మోదీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొంది. అయితే.. మహాతిర్ మహ్మద్ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని మొండిగా అంటున్నారు.