Trump: ట్రంప్‌ బంపరాఫర్‌.. గెలిస్తే ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ..

|

Aug 30, 2024 | 11:51 AM

గురువారం మిషిగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను అధికారంలోకి వస్తే.. IVF చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. లేదా మీ బీమా కంపెనీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి సమస్యకు ఐవీఎఫ్‌ విధానాన్ని పాటిస్తారు...

Trump: ట్రంప్‌ బంపరాఫర్‌.. గెలిస్తే ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ..
Donald Trump
Follow us on

ఎన్నికలు అంటేనే హామీలు ప్రకటించడం. ముఖ్యంగా ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీలను కురిపిస్తుంటారు రాజకీయ నాయకులు. అయితే ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదండోయ్‌ అమెరికాలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన.. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్‌ చికిత్స అందిస్తానని స్పష్టం చేశారు.

గురువారం మిషిగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను అధికారంలోకి వస్తే.. IVF చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. లేదా మీ బీమా కంపెనీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి సమస్యకు ఐవీఎఫ్‌ విధానాన్ని పాటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐవీఎఫ్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. అయితే అమెరికాలో ఐవీఎఫ్‌ చికిత్స మరింత ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అంశం. అందుకే ట్రంప్‌ ఆ హామీని ఇచ్చారు.

అమెరికాలో ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌కు సుమారు పదివేల డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ విధానంలో చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. సంతానలేమి సమస్యతో బాధపడే మహిళలకు.. ప్రయోగశాలలో అండాన్ని, శుక్రకణాన్ని ఫలధీకరించి. అనంతరం పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశ పెడతారు. దీనినే ఐవీఎఫ్‌ విధానం అంటారు. ప్రస్తుతం భారత్‌లో కూడా ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందుతోంది.

ఇదిలా ఉంటే అమెరికాలో 1973లో రో వర్సెస్‌ వేడ్‌ కేసులో అనివార్య పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి చేయించుకునే హక్కు మహిళలకు ఉందని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే గతేడాది అదే న్యాయస్థానం ఆ తీర్పును కొట్టివేస్తూ గత ఏడాది మరో తీర్పు చెప్పింది. ఈ విషయంపై ట్రంప్‌ గత కొన్ని రోజులుగా మాట మారుస్తూ వచ్చారు. చివరికి ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకు వదిలేయాలని ప్రతిపాదించారు. దీంతో ట్రంప్‌పై విమర్శలు ఎదురయ్యాయి. కాగా ప్రస్తుతం ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన కొత్త చర్చకు దారి తీసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..