భారతీయ వైద్యుడి 110వ జయంతి వేడుకలు నిర్వహించిన చైనా

| Edited By:

Oct 12, 2020 | 11:48 AM

 గత కొన్ని నెలలుగా భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ భారతీయ సంతతి వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులు అర్పించడం ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది

భారతీయ వైద్యుడి 110వ జయంతి వేడుకలు నిర్వహించిన చైనా
Follow us on

Doctor Dwarkanath Kotnis:  గత కొన్ని నెలలుగా భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ భారతీయ సంతతి వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులు అర్పించడం ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైద్యుడు ద్వారకానాథ్‌ కోట్నిస్‌కి 110 జయంతి సందర్భంగా చైనా ప్రభుత్వం‌ నివాళులు అర్పించింది. అంతేకాదు అక్కడి విద్యార్థులు ద్వారకానాథ్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అయితే మనదేశమంటే పెద్దగా గిట్టని చైనా, భారత్‌కి చెందిన ద్వారకానాథ్‌కి నివాళులు అర్పించడం వెనుక ఓ కథ ఉంది.

1938లో చైనా, జపాన్‌ల మధ్య జరిగిన రెండో యుద్ధం సమయంలో..  చైనా సైనికులకు సాయం అందించేందుకు భారత్ నుంచి ఐదుగురు వైద్యల బృందం అక్కడకు వె‍ళ్లింది. వారిలో ద్వారకానాథ్‌ కోట్నిస్ ఒకరు. ఇక యుద్ధం ముగిసిన తరువాత నలుగురు వైద్యులు తిరిగి భారత్‌కు వచ్చారు. కాగా కోట్నిస్ మాత్రం చైనాలోనే ఉండిపోయి, తరువాత కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరారు. మావో చేపట్టిన చైనా ఉద్యమంలోనూ ఆయన పాలు పంచుకున్నారు. ఇక  1942లో 35 ఏళ్ల వయసులో కోట్నిస్ అక్కడే మరణించారు. ఆయన సేవలను గుర్తించిన చైనా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున సంస్మరణ సభ నిర్వహిస్తూ వస్తోంది.

Read More:

తెరపైకి సౌందర్య బయోపిక్‌.. సాయి పల్లవి ఫిక్స్‌..!

అఫీషియల్‌: శర్వా మహాసముద్రంలో ‘అదితీ’