ప్రపంచంలోనే ఎత్తైన భవనం..క్షణాల్లో నేలమట్టం

|

Nov 26, 2019 | 8:07 PM

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారీ భవనాన్ని క్షణాల్లోనే కూల్చివేశారు అధికారులు. సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లోని 108 మీటర్ల ఎత్తైన బ్యాంక్‌ ఆఫ్‌ లిస్బన్‌ టవర్‌ కేవలం 30 సెకన్లలోనే నేలమట్టమైంది. గత సెప్టెంబర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ భవంతి తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ టవర్‌..ఎంతమాత్రం సేఫ్‌ కాదని అంచనాకొచ్చిన స్థానిక ప్రభుత్వం..కూల్చివేయాలని నిర్ణయించింది. దీంతో 22 అంతస్తుల ఈ భవనాన్ని 894 కిలోల పేలుడు […]

ప్రపంచంలోనే ఎత్తైన భవనం..క్షణాల్లో నేలమట్టం
Follow us on

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారీ భవనాన్ని క్షణాల్లోనే కూల్చివేశారు అధికారులు. సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లోని 108 మీటర్ల ఎత్తైన బ్యాంక్‌ ఆఫ్‌ లిస్బన్‌ టవర్‌ కేవలం 30 సెకన్లలోనే నేలమట్టమైంది. గత సెప్టెంబర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ భవంతి తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ టవర్‌..ఎంతమాత్రం సేఫ్‌ కాదని అంచనాకొచ్చిన స్థానిక ప్రభుత్వం..కూల్చివేయాలని నిర్ణయించింది. దీంతో 22 అంతస్తుల ఈ భవనాన్ని 894 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చివేశారు.

అంతకు ముందు సమీపంలోని 2వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు నేలమట్టం చేసిన భవనాల్లో 114 మీటర్ల ఎత్తున్నభవనం మొదటిది కాగా..108మీటర్ల ఎత్తుతో బ్యాంక్‌ ఆఫ్‌ లిస్బన్‌ రెండవ స్థానంలో నిలిచింది. దీని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు అధికారులు. ఈ భవనాన్ని కూల్చడం కష్టమైనా..విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు.