మయన్మార్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం, ప్రజానేత ఆంగ్ సాన్ సూకీ నిర్బంధం

| Edited By: Anil kumar poka

Feb 01, 2021 | 5:01 PM

మయన్మార్ లో జరిగిన సైనిక కుట్రలో మిలిటరీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని, ఆమె పార్టీ సభ్యులను సైన్యం నిర్బంధించింది. టాప్ ఆర్మీ కమాండర్ కి అధికారాన్ని అప్పజెప్పడమే కాక, ఏడాది పాటు  ఎమర్జెన్సీని కూడా విధించారు. లోగడ జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ..ఆ ఎన్నికలు ఫ్రాడ్ అని సైన్యం ఆరోపించింది. అయితే దీన్ని అంగీకరించవద్దని, కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలని సూకీ తన మద్దతుదారులను కోరారు. సైనిక […]

మయన్మార్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం, ప్రజానేత ఆంగ్ సాన్ సూకీ నిర్బంధం
Follow us on

మయన్మార్ లో జరిగిన సైనిక కుట్రలో మిలిటరీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని, ఆమె పార్టీ సభ్యులను సైన్యం నిర్బంధించింది. టాప్ ఆర్మీ కమాండర్ కి అధికారాన్ని అప్పజెప్పడమే కాక, ఏడాది పాటు  ఎమర్జెన్సీని కూడా విధించారు. లోగడ జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ..ఆ ఎన్నికలు ఫ్రాడ్ అని సైన్యం ఆరోపించింది. అయితే దీన్ని అంగీకరించవద్దని, కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలని సూకీ తన మద్దతుదారులను కోరారు. సైనిక చర్యలు  దేశాన్ని మళ్ళీ నియంతృత్వ దశలోకి నెట్టాయని ఆమె అన్నారు.

2011 వరకు మయన్మార్ లో సైనిక పాలన సాగింది. అయితే సూకీ వ్యాప్తి చెందింపజేసిన ప్రజాస్వామ్య సంస్కరణల కారణంగా మిలిటరీ రూల్ అంతమైంది. 1989-2010 మధ్య సుమారు 15 ఏళ్లపాటు ఆంగ్ సాన్ జైలుశిక్ష అనుభవించారు. 1991 లో ఈమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. కొత్త ప్రభుత్వంలో కమాండర్-ఇన్-చీఫ్…. మిన్  ఆంగ్ లెయింగ్ కి అధికారాన్ని అప్పగిస్తున్నట్టు సైనికులు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ దేశంలోని అనేక నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ డేటా సర్వీసులను తాత్కాలికాలంగా నిలిపివేశారు. బ్యాంకులను కూడా ఇలాగే తాత్కాలికంగా మూసివేయడంతో  ఏటీఎం ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

Read More:హెచ్-1బీ వీసాలపై అమెరికా కోర్టు సంచలన తీర్పు, లక్షలాది భారతీయులకు ఊరట, ట్రంప్ కు దెబ్బ.