Talibans: తాలిబాన్లకు లొంగిపోయేందుకు నిరాకరించిన రెజిస్టెన్స్ ఫోర్స్ నేత అహ్మద్ మసూద్..

| Edited By: Anil kumar poka

Aug 23, 2021 | 9:52 AM

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లపై పోరు జరుపుతున్న ఆఫ్ఘన్ రెజిస్టెన్స్ ఫోర్స్ దళాల నేత అహ్మద్ మసూద్ వారికి లొంగిపోయేందుకు నిరాకరించాడు. పంజ్ షిర్ ప్రావిన్స్ సమీప ప్రాంతాల్లో వారిపై పోరాటం జరుపుతున్న దళాల్లో ఈయన నేతృత్వం లోని ఫోర్స్ కూడా ఒకటి. తన ఆధీనంలోని ప్రాంతాలను...

Talibans: తాలిబాన్లకు లొంగిపోయేందుకు నిరాకరించిన రెజిస్టెన్స్ ఫోర్స్ నేత అహ్మద్ మసూద్..
Ahmood Masaud Refuse To Surrender To Talibans
Follow us on

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లపై పోరు జరుపుతున్న ఆఫ్ఘన్ రెజిస్టెన్స్ ఫోర్స్ దళాల నేత అహ్మద్ మసూద్ వారికి లొంగిపోయేందుకు నిరాకరించాడు. పంజ్ షిర్ ప్రావిన్స్ సమీప ప్రాంతాల్లో వారిపై పోరాటం జరుపుతున్న దళాల్లో ఈయన నేతృత్వం లోని ఫోర్స్ కూడా ఒకటి. తన ఆధీనంలోని ప్రాంతాలను వారికి అప్పగించి లొంగిపోవడానికి మసూద్ నిరాకరిస్తూ..ఎంతైనా తాము పోరాడుతామని పేర్కొన్నాడు. ఈ లోయను 4 గంటల్లోగా అప్పగించి లొంగిపోవాలని తాలిబన్లు ఇతడిని హెచ్చరించారు. అయితే సుమారు 9 వేల బలగాలు గల మసూద్ మాత్రం తాము లొంగిపోబోమని స్పష్టం చేశాడు. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగే యత్నాలను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తానూ వారిని హెచ్చరించాడు. మసూద్ తండ్రి ముజాహిదీన్ కమాండర్ అహ్మద్ షా మసూద్ ని తాలిబన్లు 2001 సెప్టెంబరు 11 న కాల్చి చంపారు. అయితే దేశంలో శాంతి, భద్రతలు నెలకొనేలా చూస్తామని తాలిబన్లు హామీ ఇచ్చిన పక్షంలో తాను వారిని క్షమించి వదిలేస్తానని అహ్మద్ మసూద్ అంటున్నాడు.రక్తపాతాన్ని నివారించడమే తన లక్ష్యమన్నాడు.

అంతకు ముందే తాలిబన్లు..వేలాది ఫైటర్లు ఈ లోయను ఆక్రమించుకోవడానికి వస్తున్నారని. అందువల్ల దీన్ని అప్పగించి లొంగిపోవాలని ట్విటర్ ద్వారా హెచ్చరించారు. వీరు కాబూల్ నగరాన్ని వశపరచుకున్న అనంతరం పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్లు ఈ లోయవైపు పారిపోయి వస్తున్నారు. ఇక్కడా తమకు రక్షణ, భద్రత ఉంటుందని వారు ఆశిస్తున్నారు. అవసరమైతే తాలిబాన్లపై జరిగే పోరులో తాము కూడా రెజిస్టన్స్ ఫోర్స్ కి సాయపడతామని వారంటున్నారు. మరోవైపు దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు సిద్ధపడుతున్నారు. పలువురు జిహాదీ నాయకులు కాబూల్ నగరాన్ని చేరుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: 300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.

తేజస్‌తో యుద్ధ విమానంలో ఉపరాష్ట్రపతి.. బెంగుళూరు హెచ్ఏఎల్ కార్య‌క్ర‌మంలో వెంక‌య్య‌నాయుడు..:Venkaiah Naidu Video.

News Watch Video: కరోనా కంటే డేంజర్…! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్ (వీడియో).

సోదరుడిని చంపిన వ్యక్తితో ప్రేమ.. 32 ఏళ్ల తర్వాత పెళ్లి.. వైరల్ వీడియో..: 32 Years Love Storie Video.