Iran: ఇరాన్ లో భారీ భూకంపం.. 5 మంది మృతి.. 44 మందికి గాయాలు

|

Jul 02, 2022 | 9:46 PM

భూకంపంతో ఇరాన్ (Iran) అల్లాడిపోయింది. 6.3 తీవ్రతతో దక్షిణ ఇరాన్ లో వచ్చిన భూప్రకంపనల ధాటికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో 44 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతుల్లో భూకంపం కేంద్రం ఉందని ఆ దేశ అధికార వర్గాలు...

Iran: ఇరాన్ లో భారీ భూకంపం.. 5 మంది మృతి.. 44 మందికి గాయాలు
Nepal Earthquake
Follow us on

భూకంపంతో ఇరాన్ (Iran) అల్లాడిపోయింది. 6.3 తీవ్రతతో దక్షిణ ఇరాన్ లో వచ్చిన భూప్రకంపనల ధాటికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో 44 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతుల్లో భూకంపం కేంద్రం ఉందని ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఇటీవలి కాలంలో ఇరాన్ లో భూకంపాలు తరచుగా వస్తున్నాయి. ఇరాన్ లో సంభవించిన ఈ భూకంపం వల్ల యూఏఈ లోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలూ భయాందోళనకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున 1.32 గంటలకు భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరో మూడు దేశాల్లోనూ భూప్రకంపనలు నమోదయ్యాయి. ఖతార్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. ఇరాన్ దక్షిణ భాగంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. దుబాయ్ నగరంలోనూ భూమి కంపించింది.

ఇరాన్, యూఏఈ, ఖతార్‌లలో శనివారం ఉదయం రెండు పెద్ద భూకంపాలు సంభవించాయి. దీని కారణంగా ఇరాన్‌లో చాలా మంది చనిపోయారు. అదే సమయంలో చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాత్రి 3:30 గంటలకు ఇక్కడ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.