అమెరికాలో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా..చిన్నారి మృతి

|

Sep 17, 2019 | 4:22 PM

అమెరికాలో 10 ఏళ్ల చిన్నారి అత్యంత అరుదైన అమీబా బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. లిల్లీ మే అవంత్‌ అనే బాలిక వీకెండ్‌లో సరదాగా టెక్సాస్‌ నదిలో స్విమ్మింగ్‌కు వెళ్లింది. ఆ తర్వాత చిన్నారి విపరీతమైన తలనొప్పి, ఫీవర్‌తో బాధపడుతుండటంతో ఫోర్ట్‌ వర్త్‌లోని కుక్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. ఐతే ఆమె బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా బారిన పడిందని డాక్టర్లు చెప్పడంతో ఆ బాలిక త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేశారు. ఆమె కుటుంబానికి మద్దతుగా […]

అమెరికాలో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా..చిన్నారి మృతి
Follow us on

అమెరికాలో 10 ఏళ్ల చిన్నారి అత్యంత అరుదైన అమీబా బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. లిల్లీ మే అవంత్‌ అనే బాలిక వీకెండ్‌లో సరదాగా టెక్సాస్‌ నదిలో స్విమ్మింగ్‌కు వెళ్లింది. ఆ తర్వాత చిన్నారి విపరీతమైన తలనొప్పి, ఫీవర్‌తో బాధపడుతుండటంతో ఫోర్ట్‌ వర్త్‌లోని కుక్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. ఐతే ఆమె బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా బారిన పడిందని డాక్టర్లు చెప్పడంతో ఆ బాలిక త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేశారు. ఆమె కుటుంబానికి మద్దతుగా నిలిచారు. కానీ వారి ప్రార్థనలేవీ ఫలించలేదు. అవంత్‌ ఆరోగ్యం మరింత విషమించి మృతి చెందింది. దీంతో కన్నీరుమున్నీరవుతున్నారు లిల్లీ మే తల్లిదండ్రులు. తమ బిడ్డ దేవుని దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

కలుషిత నీటిలోకి దిగినప్పుడు ముక్కు ద్వారా బ్రైన్‌ ఈటింగ్‌ అమీబా శరీరంలోకి చేరుతుందంటున్నారు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధికారులు. ఇన్ఫెక్షన్‌ సోకినవారం తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయని..ఆ తర్వాత ఐదు రోజులకు మనిషి ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు. ఇప్పుడు లిల్లీ మే కూడా నెగ్లేరియా ఫొవ్లేరితో మృతి చెందిందని..దీనిని బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాగా పిలుస్తారని తెలిపారు. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా పేరు బయటకు రావడంతో అమెరికన్లు వణికిపోతున్నారు. సాధారణంగా అమెరికా అంతటా మంచి నీటిలోఈ అమీబా కనిపిస్తుంటుందని..ఐతే ప్రమాదమేమీ లేదని అంటున్నారు యూఎస్‌ అధికారులు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని అంటున్నారు.