Budget 2021: రేపే కేంద్ర బడ్జెట్, ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, కోవిడ్ తెచ్చిన కష్టాలు తీరేనా ?

సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉన్నాయి.

Budget 2021: రేపే కేంద్ర బడ్జెట్, ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, కోవిడ్ తెచ్చిన కష్టాలు తీరేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 31, 2021 | 1:21 PM

Budget 2021-22: సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ సృష్టించిన ‘అల్లకల్లోలం’ ఇంతాఅంతా కాదు. ఆర్ధిక వ్యవస్థ క్షీణించగా..కోట్లమంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫాక్టరీలు మూతపడ్డాయి,. వలస కార్మికులకు ఉన్న ఉపాధి కూడా మృగ్యమైంది. నెలలతరబడి కొనసాగిన లాక్ డౌన్ కనీవినీ ఎరుగని పరిస్థితిని సృష్టించింది. అన్ లాక్ అంటూ నాలుగైదు దశలుగా ఆంక్షల సడలింపును ప్రభుత్వం ప్రకటించిన తరువాత కూడా చాలా నెలలపాటు ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే దేశ ఆర్థికపరిస్థితిని పునరుజ్జీవింప జేసేందుకు, యువతకు, ఇతరులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. ఆత్మ నిర్భర్ వంటి పథకాల ద్వారా కోట్ల రూపాయల నిధులతో సంస్కరణల పర్వానికి శ్రీకారం చుట్టింది. రైతుల మేలుకు,  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దిపై దృష్టి సారించింది. కానీ ఇవేవీ చాలవు.

వ్యాక్సిన్లు, అందుబాటులోకి రావడం, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇక భావి  చర్యలపై బడ్జెట్ ఫోకస్ పెట్టాల్సిందే.. వచ్ఛే ఐదేళ్లకు గాను ఏటా 20 లక్షల కోట్ల నిధులను వెచ్చించేందుకు ఉద్దేశించిన మాసివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఏర్పాటుకు  అవసరమైన ఫైనాన్షియల్ ఇన్స్ టి ట్యూషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందుకు ఈ కొత్త బడ్జెట్ దోహదపడుతుందని భావిస్తున్నారు. భారత ఎకనామిక్ రికవరీ ‘కె’ షేప్ లో ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు ఆర్ధికమంత్రి పలు చర్యలు చేపట్టవలసి ఉంది. ఎకానమీలో జాబ్స్ 50 శాతం. జీడీపీ వృద్ది 21, కంసంప్షన్ 10, ఇన్వెస్ట్మెంట్ 10, క్రెడిట్ క్రైసిస్ 9 శాతం ఉండాలన్నది లక్ష్యం కావాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

Image Credits: The Economic Times

కోవిద్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోం ఎఫెక్ట్ ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిఉంటుందని అంటున్నారు. ఈ పాండమిక్ తమ జీవితాల్లో ఒంటరితనాన్ని నింపిందని  చాలామంది చెబితే..ప్రాడక్టివిటీ మెరుగుదలకు ఇది తోడ్పడిందని 16 శాతం మంది పేర్కొన్నారు.

Image Credits: The Economic Times

ఇక పరిశ్రమలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, తదితర రంగాల వృద్దికి లక్షల కోట్లను కేటాయించవల్సి ఉంది. అదే సమయంలో రక్షణ రంగానికి, సాయుధ దళాలకు, ఇలా వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తేలాల్సి ఉంది. చిన్న, మధ్య తరగతి ఉద్యోగులకు ఊరట నిచ్చేందుకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఎంతమేరకు పెంచుతారోనన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఆర్ధిక,రెవెన్యూ లోటును ఎలా భర్తీ చేస్తారన్నది మరో ముఖ్యాంశం.