240 ఏళ్ల తర్వాత జాతీయ పక్షి హోదా

|

Dec 30, 2024 | 9:28 PM

అమెరికా జాతీయ పక్షిగా బట్టతల డేగ ను అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఆమోదించిన బిల్లుపై సంతకం చేశారు. ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా వాడుతోంది. 1782 నుంచీ యూఎస్‌ గ్రేట్‌ సీల్‌పై, డాక్యుమెంట్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశ రాజముద్రపైనా ఇది ఉంది. అయినప్పటికీ అధికారికంగా హోదా మాత్రం కల్పించలేదు.

అయితే, అనేకసార్లు దీన్ని మార్చడానికి విఫల యత్నాలు జరిగాయి. తెల్లటి తల, పసుపు పచ్చ ముక్కు, గోధుమ రంగు శరీరంతో కూడిన బాల్డ్‌ ఈగల్‌ను జాతీయ పక్షిగా ప్రతిపాదిస్తూ మిన్నెసోటా సభ్యుడు అమీ క్లోజౌచెర్‌ డిసెంబర్‌ 16న సెనెట్‌లో బిల్లు ప్రవేశ పెట్టారు. దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బైడెన్‌ ఆమోదముద్రతో 240 ఏళ్ల తరవాత బాల్డ్‌ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా దక్కింది. బాల్డ్‌ ఈగల్‌ ఉత్తర అమెరికాకు చెందిన పక్షి. మొట్టమొదట 1776లో మసాచుసెట్స్‌ రాగి సెంటుపై ఇది అమెరికా చిహ్నంగా కనిపించింది. తర్వాత వెండి డాలర్, హాఫ్‌ డాలర్, క్వార్టర్‌ తదితర యూఎస్‌ నాణేల వెనుక భాగంలో చోటుచేసుకుంది. బంగారు నాణేలకు ఈగల్, హాఫ్‌ ఈగల్, క్వార్టర్‌ ఈగల్, డబుల్‌ ఈగల్‌ అని నామకరణమూ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. టెన్షన్ పడ్డ ఫ్యామిలీ..

టిప్‌ తక్కువ ఇచ్చిందని కస్టమర్‌ను పొడిచేసిన డెలివరీ గాళ్‌

ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయిన రూ.13 వేల జీతగాడు !!

ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..

ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!