Indian – Washington: వాషింగ్టన్ వీధిలో దాడి.. భారత సంతతి వ్యక్తి మృతి. ఈ ఏడాది ఏడుగురు మృతి.
అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడులలో ఆరుగురు మరణించారు. తాజాగా మరొకరు మృతి చెందారు. వాషింగ్టన్ రెస్టారెంట్ బయట జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆ పై మృతి చెందాడు. మృతుడిని వర్జీనియాకు చెందిన వివేక్ తనేజాగా గుర్తించారు. ఫిబ్రవరి 2న జరిగిందీ ఘటన. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆ పై పేవ్‌మెంట్‌కేసి తలను బాదడంతో తీవ్రంగా గాయపడిన వివేక్ మరణించాడు.
అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడులలో ఆరుగురు మరణించారు. తాజాగా మరొకరు మృతి చెందారు. వాషింగ్టన్ రెస్టారెంట్ బయట జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆ పై మృతి చెందాడు. మృతుడిని వర్జీనియాకు చెందిన వివేక్ తనేజాగా గుర్తించారు. ఫిబ్రవరి 2న జరిగిందీ ఘటన. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆ పై పేవ్‌మెంట్‌కేసి తలను బాదడంతో తీవ్రంగా గాయపడిన వివేక్ మరణించాడు. 41 ఏళ్ల వివేక్ అర్ధరాత్రి 2 గంటలు దాటాక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఘటన వెనకున్న కారణమేంటన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి పడి వున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుడికి సంబంధించిన వివరాలు చెప్పిన వారికి 25 వేల డాలర్ల బహుమతి ప్రకటించారు. ఈ వారం మొదట్లో షికాగోలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ ముజాహిర్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. అమెరికాలో ఇప్పటికే శ్రేయాస్ రెడ్డి బెనిగెర్, నీల్ ఆచార్య, వివేక్ సైనీ, అకుల్ ధావన్ మృతి చెందారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..