Watch: అందాల పోటీల్లో సత్తాచాటిన తెలుగు వనిత.. Mrs India 2024 కిరీటం కైవసం
Mrs India 2024 Hemalatha Reddy: మలేషియాలో జరిగిన గ్లామన్ మిస్సెస్ ఇండియా 2024 పోటీల్లో తెలుగు వనిత హేమలత రెడ్డి విజేతగా నిలిచారు. సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన ఈ పోటీల్లో.. ప్రపంచ వ్యాప్తంగా 300మంది పాల్గొన్నారు. వారిలో తెలుగు మహిళ హేమలతా రెడ్డి.. ఫస్ట్ ప్లేస్ లో నిలిచి గ్లామన్ మిస్సెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
Mrs India 2024: మలేషియాలో జరిగిన గ్లామన్ మిస్సెస్ ఇండియా 2024 పోటీల్లో తెలుగు వనిత హేమలత రెడ్డి విజేతగా నిలిచారు. సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన ఈ పోటీల్లో.. ప్రపంచ వ్యాప్తంగా 300మంది పాల్గొన్నారు. వారిలో తెలుగు మహిళ హేమలతా రెడ్డి.. ఫస్ట్ ప్లేస్ లో నిలిచి గ్లామన్ మిస్సెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖలో.. సత్కరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ తో పాటు పలువురు హాజరై హేమలత రెడ్డి ని అభినందించారు. హేమ లతా రెడ్డి అందరికీ స్ఫూర్తి అని, ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగం అయ్యిందని, ఇంకా మరెన్నో టైటిల్స్ గెలుపొంది, విశాఖ పేరు నిలపాలని అభినందించారు.
విశాఖ లో జన్మించిన హేమలత రెడ్డి.. టీవీ షోలలో పనిచేశారు. హ్యాపీ డేస్ సీరియల్ లో లీడ్ రోల్ చేసిన ఆమె.. జగపతి బాబు మూవీ ప్రవరాఖ్యుడు లో నటించారు. అలాగే హీరోయిన్ గా నిన్నే చూస్తూ సినిమా కు నిర్మాత గా కూడా వ్యవహరించారు. అక్కడ నుండి గ్లామాన్ మిసెస్ ఇండియా లో ప్రపంచ వ్యాప్తంగా 300 మందితో పోటీపడి విజేతగా నిలిచారు. త్వరలో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు హేమలత రెడ్డి.