Kolkata: 30 నిమిషాల్లో 3 సార్లు ఫోన్‌..ఒక్కోసారి ఒక్కోలా.! కోల్‌కతా వైద్యురాలి కేసులో జరిగింది ఇదే.!

|

Sep 03, 2024 | 10:25 AM

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఇప్పుడు వేళ్లని ఆర్‌జీ కర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తోంది. వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఈ నెల 9న బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్‌లోని వివరాలు బాధిత తల్లిదండ్రులు తొలుత మీడియాకు చెప్పిన వివరాలతో సరిపోలుతున్నాయి.

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఇప్పుడు వేళ్లని ఆర్‌జీ కర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తోంది. వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఈ నెల 9న బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్‌లోని వివరాలు బాధిత తల్లిదండ్రులు తొలుత మీడియాకు చెప్పిన వివరాలతో సరిపోలుతున్నాయి. ఓ మహిళ తమకు ఫోన్ చేసి కుమార్తె విషయం చెప్పినట్టు వారు పేర్కొన్నారు.

ఆసుపత్రిలోని చాతీ విభాగంలో వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ నెల 14న మీడియాతో మాట్లాడుతూ బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు నాన్ మెడికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఒకరు తమకు ఫోన్ చేసినట్టు తెలిపారు. సీబీఐ ఆమెను ప్రశ్నించింది. అయితే, ఘటన జరిగిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఆమె మీడియా ముందుకు రాలేదు. ఆ కాల్‌లో ఆ మహిళ వైద్యురాలి తండ్రితో మాట్లాడుతూ.. ‘‘మీ అమ్మాయి తీవ్ర అస్వస్థతో బాధపడుతోంది. ఆసుపత్రిలో చేర్చాం. త్వరగా రండి’’ అని పేర్కొన్నారు. ఏమైందని ఆయన అడిగితే ‘‘ఆమెకు బాగాలేదు. ఆమెకు ఏమైందన్నది వైద్యులు మాత్రమే చెప్పగలరు. మీ నంబరు తెలుసుకుని ఫోన్ చేశాం అని చెప్పారు.

మరో ఆడియో క్లిప్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆమెకు సీరియస్‌గా ఉంది. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశాం. ఏమైందో నేను చెప్పలేను. వైద్యులు మాత్రమే చెప్పగలరు.. త్వరగా రండి’’ అని పేర్కొన్నారు. ‘ఇంతకీ మీరెవరు?’ అని అడిగితే ‘నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. నేను డాక్టర్‌ను కాదు. అని చెప్పారు. మూడోసారి ఫోన్ చేస్తూ.. ‘‘ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయినట్టుగా ఉంది. పోలీసులు వచ్చారు. మేమంతా ఇక్కడే ఉన్నాం. వీలైనంత త్వరగా రండి’’ అని పేర్కొన్నారు. ఆయన తన ఫోన్ స్పీకర్‌ను ఆన్ చేయడంతో ఆ విషయాన్ని బాధితురాలి తల్లి కూడా వింది.
పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆమె తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్య జూనియర్ వైద్యురాలు చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రి వైద్యులు మాత్రం మృతదేహాన్ని 9 గంటలకు సెమినార్ హాల్‌లో చూసినట్టు చెప్పారు. ఆసుపత్రి నుంచి 10.53 గంటలకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత రెండు కాల్స్ వచ్చినట్టు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.