Money Laundering: స్విస్‌ బ్యాంకులో కోట్లు వెనకేసిన వారి లిస్ట్ కేంద్రం చేతికి స్విస్ ఖాతాదారుల జాతకాలు

|

Oct 13, 2023 | 6:21 PM

స్విస్‌ బ్యాంకులో ఖాతా తెరిచిన భారతీయులు, భారతీయ సంస్థల జాబితా కేంద్ర ప్రభుత్వానికి అందింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఐదో జాబితాను స్విట్జర్లాండ్‌ అందజేసింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది వరకు నాలుగు జాబితాలను ఆ దేశం పంపించింది.

స్విస్‌ బ్యాంకులో ఖాతా తెరిచిన భారతీయులు, భారతీయ సంస్థల జాబితా కేంద్ర ప్రభుత్వానికి అందింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఐదో జాబితాను స్విట్జర్లాండ్‌ అందజేసింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది వరకు నాలుగు జాబితాలను ఆ దేశం పంపించింది. తాజా జాబితాలో మొత్తం 104 దేశాలకు చెందిన 36 లక్షల ఖాతాల వివరాలు ఉన్నాయి. స్విస్‌ పంచుకున్న వివరాల్లో ఖాతాదారుల పేర్లు, చిరునామా, ఖాతా సంఖ్య, ఆర్థిక సమాచారం, నివాసం, ట్యాక్స్‌ నంబర్‌ తదితర ముఖ్యమైన విషయాలు ఉన్నట్లు తెలిసింది. అలాగే ఆర్థిక సంస్థల పేరు, వాటి ఖాతాలోని నిల్వలు, మూలధన ఆదాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా అధికారులు మనీల్యాండరింగ్‌, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ, పన్ను ఎగవేతలు, ఇతర నేరాలపై విచారణ చేపట్టనున్నారు. తాజాగా అందిన ఖాతాల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీ చేయనున్నారు. ట్యాక్స్‌ రిటర్నులలో ఆ మొత్తాలను పొందుపరిచారా? లేదా అనే విషయాన్ని పరిశీలించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..