Telangana: పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించనున్న తెలంగాణ సర్కార్

|

Feb 02, 2024 | 2:00 PM

పద్మ అవార్డులు -2024 కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ వరించింది. ఇక తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరందర్ని సత్కరించనుంది తెలంగాణ సర్కార్.

పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేయనుంది..మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం..అలాగే కొండప్ప, సమ్మయ్య, విఠలాచార్య, కేతావత్‌, ఆనందాచారిలను పద్మశ్రీ వరించింది..దీంతో వీరందరికి తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేయనుంది..ఇందులో భాగంగా వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు మంత్రి జూపల్లి.. అటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు జూపల్లి..ఈనెల 4న శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమం జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

 

Published on: Feb 02, 2024 01:58 PM