Manchu Lakshmi: అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.

|

Oct 03, 2024 | 9:38 AM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మల్టీ ట్యాలెంటెడ్ ఉమెన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన మంచు వారమ్మాయి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటుందామె.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మల్టీ ట్యాలెంటెడ్ ఉమెన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన మంచు వారమ్మాయి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటుందామె. అలాగే తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అలా మంచు లక్ష్మీ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. లక్ష్మక్క డ్యాన్సింగ్ ట్యాలెంట్‌ నెట్టింట క్రేజీ కామెంట్స్ కు కేరాఫ్‌ అవుతోంది.

ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇందులో పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా చుట్ట మల్లే సాంగ్ అయితే అభిమానులకు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చింది. ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వీ అందాలు పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ కారణంగానే చుట్ట మల్లే సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చుట్టమల్లే సాంగ్ నే వినిపిస్తోంది. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. అలా తాజాగా మంచు లక్ష్మీ కూడ దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ కు కాలు కదిపింది. బ్లాక్ శారీ ధరించి ఉత్సాహంగా స్టెప్పులేసింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. లక్ష్మక్క చితక్కొట్టిందనే కామెంట్ కొంత మంది నెటిజన్స్ నుంచి వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on