Indigo Prices: తగ్గిన ఇండిగో విమాన టికెట్ల ధరలు.! ఎప్పటి నుండి అంటే.?

|

Jan 08, 2024 | 1:31 PM

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇండిగో ఫ్లైట్‌ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. టికెట్లపై ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని తొలగిస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఇంధన ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మూడు నెలల క్రితం దీనిని ప్రవేశపెట్టారు. తొలగింపు నిర్ణయం జనవరి 4 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇండిగో ఫ్లైట్‌ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. టికెట్లపై ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని తొలగిస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఇంధన ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మూడు నెలల క్రితం దీనిని ప్రవేశపెట్టారు. తొలగింపు నిర్ణయం జనవరి 4 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. ఇటీవల విమాన ఇంధన ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే ప్రత్యేక ఛార్జీని తొలగించాలని నిర్ణయించినట్లు ఇండిగో తెలిపింది. అయితే, ఏటీఎఫ్‌ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో టికెట్ల ధరలనూ అందుకనుగుణంగా సవరిస్తామని స్పష్టం చేసింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఇంధనానిదే సింహభాగం. విమాన ఇంధన ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు జనవరిలో 3.9 శాతం తగ్గించాయి. ధర తగ్గింపు వరుసగా ఇది మూడోసారి. ఇప్పటి వరకు ఢిల్లీలో కిలోలీటరు ధర 1,06,155 రూపాయల 67 పైసలు కాగా, ఇప్పుడు 4,162 రూపాయల 50 పైసలు తగ్గి 1,01,993 రూపాయల 17 పైసలకు చేరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.