indigo CEO: ఆ ఘటన నన్ను కలిచివేసింది.. ఆ బాలుడికి ఎలక్ట్రిక్‌ వీల్‌ఛైర్‌ కొనిస్తా..:ఇండిగో సీఈఓ.

|

May 18, 2022 | 8:47 AM

దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కనివ్వని ఘటనపై ఇండిగో సీఈఓ విచారం తెలిపారు. బాలుడికి ఎలక్ట్రిక్‌ వీల్ ఛైర్‌ కొనిస్తానని తెలిపారు. "దివ్యాంగ చిన్నారుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తోన్న తల్లిదండ్రులే


దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కనివ్వని ఘటనపై ఇండిగో సీఈఓ విచారం తెలిపారు. బాలుడికి ఎలక్ట్రిక్‌ వీల్ ఛైర్‌ కొనిస్తానని తెలిపారు. “దివ్యాంగ చిన్నారుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తోన్న తల్లిదండ్రులే ఈ సమాజానికి నిజమైన హీరోలు. వారి అంకితభావానికి అభినందనగా ఆ బాలుడికి ఒక ఎలక్ట్రిక్‌ వీల్‌ఛైర్‌ కొనిస్తా’’ అని ప్రకటించారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు దివ్యాంగ బాలుడితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడిని విమానం ఎక్కించడానికి ఇండిగో సిబ్బంది అడ్డుపడ్డారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో డీజీసీఏ విచారణకు ఆదేశించింది. మరోవైపు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us on