‘గద్దలకొండ గణేష్’ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. అదిరిపోయాయి!

Varun Tej's Gaddalakonda Ganesh first day box office collections report, ‘గద్దలకొండ గణేష్’ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. అదిరిపోయాయి!

‘వాల్మీకీ’ టైటిల్‌తో.. రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది ఈ సినిమా. అనంతరం.. రిలీజ్‌కి ఒక రోజు ముందు.. ‘గద్దలకొండ గణేష్’గా పేరుమార్చి రిలీజ్ చేశారు. అయినా.. ఈ సినిమా విడుదలై.. ముందుకు దూసుకుపోతోంది. ఫస్ట్‌డేనే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం.. తొలి రోజు సత్తాను చాటుకుంది. అయితే.. సినిమా టైటిల్ విషయంలో.. డైరెక్టర్ హరీష్ శంకర్ కాస్త భావోద్వేగానికి లోనైయ్యారు. సినిమా రిలీజ్ సమయంలో.. ఇలా పేరు మార్చితే.. సినిమా హిట్‌ అవుంతుందా లేదా.. అని అనుమానాలు కూడా వచ్చాయి.

కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. దిగ్విజయంగా దూసుకుపోతోంది. గద్దలకొండ గణేష్ ప్రజలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమా తొలి రోజు రూ.4.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. పక్కా గ్యాంగ్‌స్టర్ కథా రూపంలో.. తీసిన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. టీజర్‌ రిలీజ్‌తోనే మంచి టాక్‌ను తెచ్చుకుంది ఈ సినిమా. ఇక వరుణ్ తేజ్ తన నటా విశ్వ రూపాన్ని ఈ సినిమాలో చూపించాడు. తెలంగాణ యాసలో మాట్లడుతూ.. ఆ పాత్రకి కరెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. తమిళ సినిమా ‘జిగర్తాండ’కు‌ రిమేక్‌గా ఈ సినిమ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *