ఉన్నావ్ కేసు.. లేఖ చదవలేదన్న సీజేఐ.. రేపు విచారణ

ఉన్నావ్ కేసు మళ్ళీ దేశవ్యాప్త సంచలనమైంది. తమకు ప్రాణహాని పొంచి ఉందంటూ రేప్ కేసు బాధితురాలి కుటుంబ సభ్యులు రాసిన లేఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కి ఆలస్యంగా అందడం మరో సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడగా.. ఈ ఫ్యామిలీలోని ఇద్దరు మహిళలు మరణించినట్టు వార్తలు వచ్చాయి. జైల్లో ఉన్న బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్ ప్లాన్ ప్రకారం తమపై ఈ […]

ఉన్నావ్ కేసు.. లేఖ చదవలేదన్న సీజేఐ.. రేపు విచారణ
Follow us

|

Updated on: Jul 31, 2019 | 2:35 PM

ఉన్నావ్ కేసు మళ్ళీ దేశవ్యాప్త సంచలనమైంది. తమకు ప్రాణహాని పొంచి ఉందంటూ రేప్ కేసు బాధితురాలి కుటుంబ సభ్యులు రాసిన లేఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కి ఆలస్యంగా అందడం మరో సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడగా.. ఈ ఫ్యామిలీలోని ఇద్దరు మహిళలు మరణించినట్టు వార్తలు వచ్చాయి. జైల్లో ఉన్న బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్ ప్లాన్ ప్రకారం తమపై ఈ హత్యాయత్నం చేశారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది.కాగా- ఈ నెల 12 న ఆమె కుటుంబం లేఖ రాస్తే అది తనకు ఆలస్యంగా అందిన విషయంపై రిపోర్ట్ పంపాలని చీఫ్ జస్టిస్ గొగోయ్ పోలీసులను ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ను కూడా ఆయన కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు రాసిన లేఖతో బాటు దీనిపై కూడా ఆయన గురువారం విచారణ జరపనున్నారు.  అయితే ఈ లేఖ విషయం తనకు దినపత్రికల ద్వారానే తెలిసిందని ఆయన చెప్పడం గమనార్హం. దీని గురించి ఈ ఉదయం డైలీల్లో చదివానని, అసలు ఈ లెటర్ ను తాను ఇప్పటివరకు చదవలేదని ఆయనపేర్కొన్నారు.

దురదృష్టవశాత్తూ ఈ లేఖ ఇంకా బయటపడలేదు. న్యూస్ పేపర్లే దీన్ని ఫ్లాష్ చేశాయి..ఇలాంటి విపత్కర పరిణామాల్లో ఈ విధమైన ఘటనలు జరగకుండా చూసేందుకు ఏదో ఒకటి చేయాల్సి ఉంది ని అయన వ్యాఖ్యానించారు. పోక్సో చట్టం కింద వెంటనే ఈ కేసుపై విచారణ చేపట్టాలని సీనియర్ లాయర్ వి.గిరి కోర్టును కోరారు. 2017 లో జాబ్ కోసం ఉన్నావ్ వెళ్లిన  బాధితురాలిపై సెంగార్ అత్యాచారం జరిపిన ఘటన పెను దుమారం రేపింది. గత ఏడాది ఏప్రిల్ లో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు