కేరళలో వణికిస్తున్న కొత్త వైరస్

|

Mar 18, 2019 | 1:07 PM

తిరువనంతపురం: కేరళలో కొత్త వైరస్ వణికిస్తోంది. దాని పేరు వెస్ట్ నైల్ వైరస్. ఇది ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ వైరస్‌ నివారించడానికి ఇప్పటివరకు మందు లేదు. తొలుత 1937లో యుగాండాలో కనుగొన్నారు. ఈ వైరస్‌ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే మలప్పురం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కోజికోడ్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా వెస్ట్‌ నైల్‌ వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. […]

కేరళలో వణికిస్తున్న కొత్త వైరస్
Follow us on

తిరువనంతపురం: కేరళలో కొత్త వైరస్ వణికిస్తోంది. దాని పేరు వెస్ట్ నైల్ వైరస్. ఇది ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఈ వైరస్‌ నివారించడానికి ఇప్పటివరకు మందు లేదు. తొలుత 1937లో యుగాండాలో కనుగొన్నారు. ఈ వైరస్‌ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే మలప్పురం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కోజికోడ్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా వెస్ట్‌ నైల్‌ వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

దీంతో అక్కడి వైద్యులకు సహాయం అందించడానికి ఎన్‌సీడీసీ గురువారం ఓ ప్రత్యేక వైద్యుల బృందాన్ని కేరళకు పంపింది. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. సోమవారం ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఈ వైరస్‌ బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండచ్చు.