Video Viral: బస్సు ఎక్కేటప్పడు ఆ మాత్రం తెలియదా.. పూర్తి ఛార్జీలు ఇవ్వమని అడిగితే కండక్టర్ పై దాడి.. దారుణంగా కొట్టి ఆపై

|

Sep 15, 2022 | 1:12 PM

బస్సులో ప్రయాణించేటప్పుడు కండక్టర్ కు ప్రయాణీకులకు మధ్య గొడవ జరగడం సాధారణమే. సరిపడా చిల్లర ఇవ్వలేదనో, ఆపమన్న చోట బస్సును ఆపలేదనో ఇలా రకరకాల కారణాలతో వాగ్వాదాలు జరుగుతుంటాయి. వీటిని...

Video Viral: బస్సు ఎక్కేటప్పడు ఆ మాత్రం తెలియదా.. పూర్తి ఛార్జీలు ఇవ్వమని అడిగితే కండక్టర్ పై దాడి.. దారుణంగా కొట్టి ఆపై
Attack On Conductor
Follow us on

బస్సులో ప్రయాణించేటప్పుడు కండక్టర్ కు ప్రయాణీకులకు మధ్య గొడవ జరగడం సాధారణమే. సరిపడా చిల్లర ఇవ్వలేదనో, ఆపమన్న చోట బస్సును ఆపలేదనో ఇలా రకరకాల కారణాలతో వాగ్వాదాలు జరుగుతుంటాయి. వీటిని అందరూ తేలికగానే తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు కండక్టర్లు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం అలాంటి షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. బస్సు ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కచ్చితమైన ఛార్జీ ఫిక్స్ చేసి ప్యాసింజర్స్ నుంచి వసూలు చేస్తుంది. అందుకు తక్కువ డబ్బులు ఇచ్చినా కండక్టర్లు టిక్కెట్ ఇవ్వరు. కానీ ఈ వీడియో లో మాత్రం ఓ వ్యక్తి తాను దిగాల్సిన స్టాప్ కు రూ.15 అయితే కేవలం రూ.10 మాత్రమే ఇచ్చాడు. ఇదేమని ప్రశ్నిస్తే నా దగ్గర ఇవే ఉన్నాయని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా కండక్టర్ పై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో మంగళవారం ఉదయం ఎన్‌సీసీ క్యాడెట్‌ కు చెందిన వ్యక్తి బస్సు ఎక్కాడు. కండక్టర్ కు చెప్పి దిగాల్సిన చోటుకు టిక్కెట్ ఇవ్వాలని అడిగాడు. రూ.15 ఛార్జ్ అవుతుందని కండక్టర్ చెప్పారు. కానీ ఆ యువకుడు మాత్రం రూ.10 మాత్రమే ఇస్తానని వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా తీవ్ర కోపంతో కండక్టర్ పై దాడికి పాల్పడ్డాడు.

బస్సలో కూర్చున్న ప్రయాణికులు చూస్తుండగా వారి ముందే విచక్షణా రహితంగా దారుణంగా కొట్టాడు. గొడవ జరుగుతున్న సమయంలోనే అతను దిగాల్సిన స్టాప్ వస్తోందని గ్రహించి, కండక్టర్‌ని వదిలేస్తాడు. తన బ్యాగ్ తీసుకుని కదులుతున్న బస్సు నుంచి దిగేస్తాడు. అతనిని ఆపడానికి కండక్టర్ ప్రయత్నిస్తున్నప్పటికీ అతను ఆగకుండా పరిగెత్తడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనపై జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. NCC క్యాడెట్‌పై FIR కూడా నమోదు చేశారు. కంప్లైంట్ మేరకు సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి