‘ నాకూ కెమెరా కావాలి ‘.. ‘ ఆక్టోపస్ మారాం ‘ !

|

Oct 23, 2019 | 6:46 PM

ఫ్రాన్స్ లో ఓ సముద్ర ‘ విహారి ‘ సరదాగా నీటి అడుగుభాగానికి వెళ్లి జలచరాలను తన కెమెరాతో ఫోటోలు తీస్తుండగా .. ఎక్కడ ఏ కలుగులోనుంచి వచ్చిందో.. ఓ చిరు ఆక్టోపస్ హఠాత్తుగా అతని ముందు ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ముచ్ఛట పడిన మనోడు.. ఉత్సాహంగా ఫోటోలు తీయబోయాడు. అయితే ఆ జీవి మాత్రం అతని ప్రయత్నానికి అడ్డు పడింది. తన పొడవైన 8 టెంటకిల్స్ తో చటుక్కున ఆ కెమెరాను పట్టేసింది. అంతే.. ఇక […]

 నాకూ కెమెరా కావాలి ..  ఆక్టోపస్ మారాం  !
Follow us on

ఫ్రాన్స్ లో ఓ సముద్ర ‘ విహారి ‘ సరదాగా నీటి అడుగుభాగానికి వెళ్లి జలచరాలను తన కెమెరాతో ఫోటోలు తీస్తుండగా .. ఎక్కడ ఏ కలుగులోనుంచి వచ్చిందో.. ఓ చిరు ఆక్టోపస్ హఠాత్తుగా అతని ముందు ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ముచ్ఛట పడిన మనోడు.. ఉత్సాహంగా ఫోటోలు తీయబోయాడు. అయితే ఆ జీవి మాత్రం అతని ప్రయత్నానికి అడ్డు పడింది. తన పొడవైన 8 టెంటకిల్స్ తో చటుక్కున ఆ కెమెరాను పట్టేసింది. అంతే.. ఇక దాని పట్టు నుంచి మనవాడు తన కెమెరాను తిరిగి తీసుకోలేకపోయాడు. దాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నించిన కొద్దీ ఆక్టోపస్ కూడా అంతే ‘ మంకుపట్టు ‘ తో తానూ వదలకుండా వెనక్కి లాగుతుండడంతో.. ఆ మనిషికి, ఆ జీవికి మధ్య ఈ వింతయిన ‘ టగ్ ఆఫ్ వార్ ‘ కొద్దిసేపు సాగింది. చివరకు ఆక్టోపస్ నే ‘ విజయం ‘ వరించింది.. దాని టెంటకిల్స్ కే తన కెమెరాను వదిలేసి ఆ ‘ కెమెరా మనిషి.’ తన మానాన తాను నీటి పైభాగానికి చేరుకున్నాడు. మొత్తానికి ఆ కెమెరా ఆ ఆక్టోపస్ కలుగులోకి చేరింది. ఎరిక్ డిస్మెట్ అనే ఆ వ్యక్తి ఎంచక్కా మరో కెమెరాతో ఇదంతా వీడియో తీసి వదిలాడు.