నువ్వంటే నాకేం భయం..చిరుత ముందు పిల్ల జింక గెంతులు

|

Dec 07, 2019 | 6:08 PM

సౌతాఫ్రికాలోని క్రూజర్ నేషనల్ పార్క్ అది.. అక్కడఓ టూరిస్టు యధాలాపంగా వన్యమృగాలను దూరం నుంచి చూస్తూ.. ఒక చోట ఆగిపోయి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పొదల్లో ఓ పిల్ల జింక.. చిరుత ముందే గెంతులు వేస్తూ .. దాన్ని భయపెట్టేందుకు ముందుకు దూసుకు వస్తున్నా ఆ చిరుత మాత్రం తన ‘ ఎర ‘ ను పట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. పైగా దాని ‘ పిల్ల చేష్టలకు ‘ కాస్త కంగారు పడినట్టు కనిపించింది. దీంతో […]

నువ్వంటే నాకేం భయం..చిరుత ముందు పిల్ల జింక గెంతులు
Follow us on

సౌతాఫ్రికాలోని క్రూజర్ నేషనల్ పార్క్ అది.. అక్కడఓ టూరిస్టు యధాలాపంగా వన్యమృగాలను దూరం నుంచి చూస్తూ.. ఒక చోట ఆగిపోయి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పొదల్లో ఓ పిల్ల జింక.. చిరుత ముందే గెంతులు వేస్తూ .. దాన్ని భయపెట్టేందుకు ముందుకు దూసుకు వస్తున్నా ఆ చిరుత మాత్రం తన ‘ ఎర ‘ ను పట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. పైగా దాని ‘ పిల్ల చేష్టలకు ‘ కాస్త కంగారు పడినట్టు కనిపించింది. దీంతో పిల్ల జింక మరింత ధైర్యంగా తన ‘ అమాయక దాడి ‘ ని కాసేపు కొనసాగించి.. వెనక్కి మళ్లింది. అయితే కాసేపటికి సీన్ మారిపోయింది. తేరుకున్న చిరుత..దూసుకెళ్లి.. ఆ ‘ పిచ్చి ‘ జింక పిల్లను నోట కరుచుకుంది. ఇక వేరే చెప్పాలా ?