Watch Video: ట్రాఫిక్ కానిస్టేబుళ్ల దాహం తీరుస్తున్న వృద్ధుడు.. సెల్యూట్ చేస్తున్న నెటిజన్స్.. వీడియో వైరల్

|

Apr 02, 2024 | 6:05 PM

‘‘అబ్బా.. ఏం సొసైటీ రా.. ఒక్కడికి కూడా హ్యుమానిటీ లేదు’’ అనే డైలాగ్స్ ఎక్కడో ఓ చోటా వినే ఉంటాం. తరచి చూడాలే కానీ.. మనచుట్టు ఎంతోమంది మానవత్వం ఉన్న మనుషులు ఉంటారు. ఇతరులను ఆలోచించేలా సాయం చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటారు. ఓ సీనియర్ సిటీజన్ ఎర్రటి ఎండలో ఇంటి పట్టున ఉండకుండా బెంగళూరు రోడ్లపై తిరుగుతూ వాటర్ మ్యాన్ గా మారాడు.

Watch Video: ట్రాఫిక్ కానిస్టేబుళ్ల దాహం తీరుస్తున్న వృద్ధుడు.. సెల్యూట్ చేస్తున్న నెటిజన్స్.. వీడియో వైరల్
Water Man
Follow us on

‘‘అబ్బా.. ఏం సొసైటీ రా.. ఒక్కడికి కూడా హ్యుమానిటీ లేదు’’ అనే డైలాగ్స్ ఎక్కడో ఓ చోటా వినే ఉంటాం. తరచి చూడాలే కానీ.. మనచుట్టు ఎంతోమంది మానవత్వం ఉన్న మనుషులు ఉంటారు. ఇతరులను ఆలోచించేలా సాయం చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటారు. ఓ సీనియర్ సిటీజన్ ఎర్రటి ఎండలో ఇంటి పట్టున ఉండకుండా బెంగళూరు రోడ్లపై తిరుగుతూ వాటర్ మ్యాన్ గా మారాడు.

బెంగళూరుకు చెందిన వృద్ధుడు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లకు వాటర్ బాటిళ్లను అందిస్తున్న వీడియో ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. చేసింది చిన్న సాయమే అయినా ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోను ఓ పోలీస్ ట్రాఫిక్ వార్డెన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘యాక్టివా నడుపుతున్న ఈ అంకుల్ పేరు నాకు తెలియదు కానీ అతని ఉద్యోగం నాకు తెలుసు అని క్యాప్షన్ ఇస్తూ ఈ వీడియోను షేర్ చేశారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు నీళ్లు ఇవ్వడం ఆయన దినచర్య. ఆయనకు నిజంగా సెల్యూట్ చేస్తున్నా’’ ఓ ట్రాఫిక్ పోలీస్ క్యాప్షన్ ఇస్తూ, అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.

స్కూటర్ ను రోడ్డు పక్కన ఆపి బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్స్ ను బయటకు తీయడం వీడియోలో చూడొచ్చు. ఎర్రటి ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లకు ఈ బాటిళ్లను అందిస్తున్నాడు. ఈ పోస్ట్ మార్చి 31న షేర్ చేశారు. అప్పటి నుంచి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అభినందిస్తూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఓ వ్యక్తి ‘వావ్. ఇలాంటి మంచి మనుషుల వల్లే ప్రపంచం ఇప్పటికీ బాగుందన్నారు.

“వావ్. అంత గొప్ప పని. నిజానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మానవత్వాన్ని గుర్తు చేస్తాయి. నేను వీలున్నప్పుడల్లా చేస్తాను అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయలేనప్పుడు మనిషిగా పుట్టి ఏం లాభం. వీరు మానవత్వాన్ని కాపాడడంటూ మరికొందరు కామెంట్ చేయగా, జై హింద్’ మరో ఇంకొందరు నెటిజన్స్ కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి