సార్ అనొద్దు రాహుల్ అని పిలువు: కాలేజ్ అమ్మాయితో రాహుల్

|

Mar 13, 2019 | 5:28 PM

చెన్నై: నన్ను సార్ అనొద్దు, రాహుల్ అని పిలువు అని ఒక కాలేజ్ అమ్మాయిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం చెన్నైలో ఉన్న రాహుల్ గాంధీ స్టెల్లామేరీ కాలేజీ విద్యార్ధినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన్ను స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తనను కష్టమైన ప్రశ్నలే అడగాలని అమ్మాయిలను కోరారు. ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి ప్రశ్నించడానికి లేవగా తనను సార్ అని పిలవొద్దని, రాహుల్ అని సంబోధించాలని రాహుల్ కోరారు. ఇందుకు […]

సార్ అనొద్దు రాహుల్ అని పిలువు: కాలేజ్ అమ్మాయితో రాహుల్
Follow us on

చెన్నై: నన్ను సార్ అనొద్దు, రాహుల్ అని పిలువు అని ఒక కాలేజ్ అమ్మాయిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం చెన్నైలో ఉన్న రాహుల్ గాంధీ స్టెల్లామేరీ కాలేజీ విద్యార్ధినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన్ను స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తనను కష్టమైన ప్రశ్నలే అడగాలని అమ్మాయిలను కోరారు.

ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి ప్రశ్నించడానికి లేవగా తనను సార్ అని పిలవొద్దని, రాహుల్ అని సంబోధించాలని రాహుల్ కోరారు. ఇందుకు ఆ అమ్మాయి కూడా రాహుల్ అని సంబోధించడంతో ప్రాంగణం మొత్తం అరుపులతో హోరెత్తింది. కాలేజీలో ఫైనాన్స్ గ్రూప్ చదువుతున్న అజ్ర అనే అమ్మాయి మాట్లాడుతూ.. టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు తీవ్రమైన నిధుల కొరత ఉందా? అని అడిగింది.

మన విద్యా సంస్థలు ధీటైన స్థాయికి చేరుకోవాలి, 6 శాతం నిధులు విద్యా వ్యవస్థకు కేటాయించాలనేది తమ లక్ష్యమని రాహుల్ అన్నారు. ఇందుకు మీ మద్దతు కావాలని విద్యార్ధులను రాహుల్ కోరారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ తెలివైన వారనేది తన అభిప్రాయమని కూడా రాహుల్ ఈ సందర్భంగా చెప్పారు.