ఇలాంటి మంచి దొంగలు కూడా ఉంటారా?

|

Mar 13, 2019 | 4:18 PM

బీజింగ్: చైనాలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దొంగ అంటేనే మొదట చెడ్డ భావన కలుగుతుంది. దొరికితే చితకబాదుతాం, కనబడితే వెంటపడదాం అనే భావనే సహజంగా అందరిలో ఉంటుంది. అయితే ఈ దొంగ మాత్రం చాలా మంచివాడిలా కనిపించాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి దొంగలు ఉంటారా అనుకునేలా ఆశ్చర్యపరిచాడు. చైనాలోని డాంగ్ నగరంలో లీ అనే మహిళ గత నెలలో ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేసింది. ఏటీఎం నుంచి 2500 యువాన్లు.. అంటే భారత కరెన్సీలో […]

ఇలాంటి మంచి దొంగలు కూడా ఉంటారా?
Follow us on

బీజింగ్: చైనాలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దొంగ అంటేనే మొదట చెడ్డ భావన కలుగుతుంది. దొరికితే చితకబాదుతాం, కనబడితే వెంటపడదాం అనే భావనే సహజంగా అందరిలో ఉంటుంది. అయితే ఈ దొంగ మాత్రం చాలా మంచివాడిలా కనిపించాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి దొంగలు ఉంటారా అనుకునేలా ఆశ్చర్యపరిచాడు.

చైనాలోని డాంగ్ నగరంలో లీ అనే మహిళ గత నెలలో ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేసింది. ఏటీఎం నుంచి 2500 యువాన్లు.. అంటే భారత కరెన్సీలో రూ. 26, 000 తీసుకుంది. అయితే ఇంతలోనే ఒక దొంగ కత్తితో వచ్చి బెదిరించి డబ్బులు లాక్కున్నాడు. ఇంకా ఏటీఎంలో ఎంత డబ్బు ఉందో చూపించమని బెదిరించాడు.

ఆమె చూపించిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. జీరో బ్యాలెన్స్ ఉందని గ్రహించిన దొంగ ఒక చిరునవ్వు నవ్వి ఆమె డబ్బు మొత్తాన్ని ఆమెకే తిరిగి ఇచ్చేశాడు. అతనిలోని మంచితనం చూపించి ఆ ఏటీఎం నుంచి వెళ్లిపోయాడు. అతని తీరును చూసి అవాక్కవ్వడం ఆ మహిళ వంతైంది. అక్కడి సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే ఆ దొంగను తర్వాత పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.