ఆక్టోపస్ కాటేస్తే.. బేర్ మంది..

| Edited By:

May 09, 2019 | 4:27 PM

ప్రాణం ఎవరికైనా ప్రాణమేగా.. మనం ఒకరి ప్రాణాలను అన్యాయంగా హరించాలనుకుంటే.. అది ఒక్కోసారి బెడిసికొడుతుంది. ప్రస్తుతం ఓ ఆక్టోపస్ కూడా అలానే చేసింది. సోషల్ మీడియాలో చాలా విచిత్రమైన వీడియోలు చూస్తూంటాం.. కానీ.. ఇప్పుడు మీరు ఈ వీడియోను చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది. చైనాకు చెందిన ఓ యువతి సజీవంగా ఉన్న ఆక్టోపస్‌ను తిందామనుకుంది. అయితే.. అది కాస్తా బెడిసి కొట్టి.. ఆ ఆక్టోపస్‌తో పోరాడాల్సి వచ్చింది. ఆక్టోపస్ తన ప్రాణం రక్షించుకోవాలని ఆ యువతి […]

ఆక్టోపస్ కాటేస్తే.. బేర్ మంది..
Follow us on

ప్రాణం ఎవరికైనా ప్రాణమేగా.. మనం ఒకరి ప్రాణాలను అన్యాయంగా హరించాలనుకుంటే.. అది ఒక్కోసారి బెడిసికొడుతుంది. ప్రస్తుతం ఓ ఆక్టోపస్ కూడా అలానే చేసింది. సోషల్ మీడియాలో చాలా విచిత్రమైన వీడియోలు చూస్తూంటాం.. కానీ.. ఇప్పుడు మీరు ఈ వీడియోను చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది. చైనాకు చెందిన ఓ యువతి సజీవంగా ఉన్న ఆక్టోపస్‌ను తిందామనుకుంది. అయితే.. అది కాస్తా బెడిసి కొట్టి.. ఆ ఆక్టోపస్‌తో పోరాడాల్సి వచ్చింది. ఆక్టోపస్ తన ప్రాణం రక్షించుకోవాలని ఆ యువతి ముఖాన్ని తన టెంటకిల్స్‌తో గట్టిగా పట్టుకుంది. దీంతో.. భయానికి గురైన ఆ యువతి బిగ్గరగా కేకలు వేస్తూ.. ఏడుస్తూ ఎలాగోలా దాని నుంచి తప్పించుకుంది. అయితే.. దాని ప్రభావం వల్ల ఆమె ముఖం మీద చిన్నపాటి గాయమే అయింది. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సజీవంగా ఉన్న ఆక్టోపస్‌ వంటి జీవులను తినొద్దని.. ఉచిత సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది ఈ వీడియోను చూశారు.