మిమి చక్రవర్తిపై బీజేపీ ఫైర్!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మిమి చక్రవర్తి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చేతులకు గ్లోవ్స్ ధరించి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా… ఇది ఓటర్లను అవమానించడమేనంటూ బీజేపీ మండిపడింది. ఇటీవలే బీజేపీలో చేరిన మేజర్ సురేంద్ర పూనియా మిమి ఫోటోలను ట్విట్టర్‌‌లో షేర్ చేస్తూ ‘‘ఇది […]

మిమి చక్రవర్తిపై బీజేపీ ఫైర్!
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 4:39 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మిమి చక్రవర్తి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చేతులకు గ్లోవ్స్ ధరించి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా… ఇది ఓటర్లను అవమానించడమేనంటూ బీజేపీ మండిపడింది.

ఇటీవలే బీజేపీలో చేరిన మేజర్ సురేంద్ర పూనియా మిమి ఫోటోలను ట్విట్టర్‌‌లో షేర్ చేస్తూ ‘‘ఇది చాలా విచారకరం. జుగుప్సాకరం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వాళ్లకు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు..’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా కొద్దిరోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మిమి చేతులకు గోళ్ల గాట్లతో పాటు, బొబ్బలెక్కాయని ఆమె బృందం వెల్లడించింది. అందుకే ఆమె తన చేతులకు గ్లోవ్స్ ధరించారని ఆమె అనుచరులు పేర్కొన్నారు. జాదవ్‌పూర్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా మిమి పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గం సీఎం మమతా బెనర్జీకి కంచుకోట లాంటిది.

https://twitter.com/MajorPoonia/status/1116375674808406019