దిశ మార్క్‌ న్యాయం అపరిచితకు దక్కేనా..?

| Edited By: Srinu

Dec 07, 2019 | 8:13 PM

దిశ మార్క్ న్యాయం కోసం అపరిచిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దిశా కేసులో న్యాయం జరిగిందని, కాని లింగాపూర్ మండలం ఎల్లాపటార్ లో దళిత మహిళపై జరిగిన దాడి విషయంలో న్యాయం జరగలేదంటూ స్థానికులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాలల్లో ప్రజలు బంద్ నిర్వహించారు.. హత్య చేసిన ఆ ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని  కోరుతూ  జైనూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. […]

దిశ మార్క్‌ న్యాయం అపరిచితకు దక్కేనా..?
Follow us on
దిశ మార్క్ న్యాయం కోసం అపరిచిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దిశా కేసులో న్యాయం జరిగిందని, కాని లింగాపూర్ మండలం ఎల్లాపటార్ లో దళిత మహిళపై జరిగిన దాడి విషయంలో న్యాయం జరగలేదంటూ స్థానికులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాలల్లో ప్రజలు బంద్ నిర్వహించారు.. హత్య చేసిన ఆ ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని  కోరుతూ  జైనూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అటు, అంబేద్కర్  యువజన సంఘం ఆధ్వర్యంలో లో మానవహారం నిర్వహించారు.. అనంతరం రాస్తారోకో చేశారు… ఘటన జరిగి మూడు వారాలైన కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మానవ హారంలో ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ పాల్గొన్నారు. దిశ కేసులో జరిగిన న్యాయమే అపరిచితకు జరగాలన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ..గోలీమార్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.