ఆర్టీసిలో మోగిన సమ్మె సైరన్‌..జేఏసీ నోటీసులు

|

Sep 20, 2019 | 5:30 PM

మరో రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రగతి రథ చక్రాలు ఆగిపోనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే యాజమాన్యానికి జేఏసీ తరపున నోటీసు అందింది. తెలంగాణా ఆర్టీసిలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ తరపున సమ్మె నోటీసు అందించారు కార్మిక సంఘం నేతలు. ఈ నెల 23, 24 తేదీల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు  టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. అన్ని డిపోల ముందు కార్మికులు ధర్నాలో పాల్గొని విజయవంతం […]

ఆర్టీసిలో మోగిన సమ్మె సైరన్‌..జేఏసీ నోటీసులు
Follow us on
మరో రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రగతి రథ చక్రాలు ఆగిపోనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే యాజమాన్యానికి జేఏసీ తరపున నోటీసు అందింది. తెలంగాణా ఆర్టీసిలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ తరపున సమ్మె నోటీసు అందించారు కార్మిక సంఘం నేతలు. ఈ నెల 23, 24 తేదీల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నట్లు  టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. అన్ని డిపోల ముందు కార్మికులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఏపీలో ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. ఆర్టీసీని సంస్థ నష్టాల్లో లేదని, ఓఆర్  పెరిగిందని అన్నారు. ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే నష్టాల పేరు ఎత్తుతోందని విమర్శించారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా సంస్థను ప్రభుత్వం కాపాడాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి  2013 లోనే  ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. ఆర్టీసీ విలీనం పై హర్యానా, పంజాబ్ వెళ్ళి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చామన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించక పోతే ఉధ్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.