Telangana: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీసుశాఖ హెచ్చరికలు

|

Sep 27, 2021 | 2:19 PM

గులాబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు పోలీసుశాఖ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పోలీసుశాఖ హెచ్చరికలు
Telangana Police
Follow us on

గులాబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు పోలీసుశాఖ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమయితే తప్ప బయటకి రావొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. నీటి ప్రవాహాలు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చిరించింది. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100ను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాబోవు కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ చేసిన ట్వీట్ దిగువన కింద చూడండి

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రూల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040*23202813 కాల్ చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.

గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ తోపాటు మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వరంగల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు.. అధికారులను ఆదేశించారు.

Also Read: హైదరాబాదీలు అలర్ట్‌.. తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్‌..

తుఫాన్ ప్రభావం, వర్షాలపై సీఎం జగన్ రివ్యూ.. కీలక ఆదేశాలు.. వారికి ఆర్థిక సాయం