పెద్దమ్మ గుడిలో చోరీ..అమ్మవారి పుస్తెమట్టెలు మాయం !

| Edited By: Srinu

Dec 13, 2019 | 6:23 PM

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఆలయ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు కనిపిస్తే చాలు మందేసి చిందులు వేస్తూ..నానా హంగామా చేస్తున్నారు.. ఇక శివారు ప్రాంతాల్లోని అనేక దేవాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయంటూ స్థానికులు గగ్గొలు పెడుతున్నారు. మద్యం మత్తులో కొందరు దుండగులు అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన అనేక సంఘటనలు జిల్లా వాసుల్ని, ఇటు అధికారులను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఆలయాలే టార్గెట్‌గా కొందరు కేటుగాళ్లు దోపిడీలకు […]

పెద్దమ్మ గుడిలో చోరీ..అమ్మవారి పుస్తెమట్టెలు మాయం !
Follow us on

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఆలయ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు కనిపిస్తే చాలు మందేసి చిందులు వేస్తూ..నానా హంగామా చేస్తున్నారు.. ఇక శివారు ప్రాంతాల్లోని అనేక దేవాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయంటూ స్థానికులు గగ్గొలు పెడుతున్నారు. మద్యం మత్తులో కొందరు దుండగులు అనేక దారుణాలకు పాల్పడుతున్నారు.

ఇటీవల జిల్లాలో జరిగిన అనేక సంఘటనలు జిల్లా వాసుల్ని, ఇటు అధికారులను సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఆలయాలే టార్గెట్‌గా కొందరు కేటుగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. దేవుడి నగలు సహా, హుండీలను ఎత్తుకెళ్లారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట గ్రామ పెద్దమ్మ తల్లి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆరునెలలుగా లెక్కించని హుండీ సహా అమ్మవారి పుస్తెమట్టెలను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే మద్యం సేవించిన వ్యక్తులు అనంతరం ఆలయంలో చోరీకి పాల్పడినట్లుగా ప్రాధమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.