Telangana: ఫోన్ ట్యాపింగ్ కామెంట్స్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే…

|

Apr 24, 2024 | 9:01 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై చర్చే అనవసరమన్నారు కేసీఆర్. అధికారులు చేసేదానికి ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. హోం సెక్రటరీ అనుమతితోనే ఇదంతా జరుగుతుందన్నారు. KCR ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరన్నారు.

Telangana: ఫోన్ ట్యాపింగ్ కామెంట్స్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే...
Kcr On Phone Tapping
Follow us on

అధినేత కేసీఆర్. ఫోన్‌ ట్యాపింగ్ అనేది పరిపాలన సంబంధమైన వ్యవహారమని క్లారిటీ ఇచ్చారు. ఫోన్‌ట్యాపింగ్‌ ప్రభుత్వం చేయదని.. పోలీసులే చేస్తారన్నారు. సమాచారం ఎలా సేకరించారో కూడా నిఘా అధికారులు చెప్పరని.. ఈ అంశంపై చర్చే అనవసరమన్నారు. సమాచారం సేకరించడానికి నిఘా అధికారులు అనేక స్ట్రాటజీలు ఉపయోగిస్తారని.. అందులో ఫోన్‌ ట్యాపింగ్‌ కూడా ఒకటి అన్నారు కేసీఆర్. హోం సెక్రటరీ అనుమతితోనే ఆఫిషియల్‌గా చేస్తారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం.. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం కంటే మంచి పనులు చేసి ప్రజల్లో పేరు తెచ్చుకోవాలన్నారు కేసీఆర్. KCR ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలన్న ప్రయత్నాలు ఫలించవన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్ ప్రకంపనలు రేపుతుంది. ఈ కేసులో పలువురు అధికారులు అరెస్ట్‌ కూడా అయ్యారు. త్వరలో రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీవీ9 లైవ్‌ షోలో కేసీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..