Telangana: గురుకుల విద్యార్థులకు కొత్త సమస్య.. హాస్టల్లో ఉండాలంటే వాటితో సావాసం చేయాల్సిందే..!

| Edited By: Balaraju Goud

Aug 29, 2024 | 7:23 PM

ప్రభుత్వ గురుకులాల్లో చదివేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు కొత్త సమస్య వచ్చింది. హాస్టల్లో ఇప్పుడు ఎలకలతో సావాసం చేయాల్సి వస్తోంది. దీంతో వారు నిద్రలేక, భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

Telangana: గురుకుల విద్యార్థులకు కొత్త సమస్య.. హాస్టల్లో ఉండాలంటే వాటితో సావాసం చేయాల్సిందే..!
Rats In Hostel
Follow us on

ప్రభుత్వ గురుకులాల్లో చదివేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు కొత్త సమస్య వచ్చింది. హాస్టల్లో ఇప్పుడు ఎలకలతో సావాసం చేయాల్సి వస్తోంది. దీంతో వారు నిద్రలేక, భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

నల్లగొండ జిల్లా కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. కొంతకాలంగా హాస్టల్లో అపరిశుభ్రంగా ఉండడంతో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎలుకలు విద్యార్థులను భయపెడుతున్నాయి. తాజాగా 13 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. అర్థరాత్రి దాటాక ఉలిక్కిపడి లేచి చూడగానే కాళ్లు, పాదాలకు గాయాలై నెత్తురు కారుతుండటాన్ని చూసుకుని భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థులు అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లడంతో గాయపడిన విద్యార్థులను తూర్పుపల్లి PHC లో చికిత్స అందించారు. బీసీ గురుకుల పాఠశాల అపరిశుభ్రంగా ఉండడం వల్లే ఎలుకలు ఎక్కువగా చేరుతున్నాయని, రాత్రి పడుకున్న తర్వాత ఎలుకలు కరిచాయని విద్యార్థులు చెబుతున్నారు. ఎలుకల భయంతో నిద్రలేక, భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. హాస్టల్ అపరిశుభ్రంగా ఉండడం వల్లే ఎలుకలు ఎక్కువగా చేరుతున్నాయని విద్యార్థులు తెలిపారు.

రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో హాస్టల్ గదులు అపరిశుభ్రంగా ఉన్న మాట వాస్తవమేనని హాస్టల్ మెడికల్ సూపర్వైజర్ చెబుతున్నారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని ఆమె చెబుతున్నారు. పాఠశాలకు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకిచ్చిన స్నాక్స్ తో గదులు అపరిశుభ్రంగా మారాయని సూపర్వైజర్ చెబుతున్నారు. ఈ స్నాక్స్ వాసనకు విద్యార్థులకు గదుల్లోకి ఎలుకలు వచ్చాయని ఆమె చెబుతున్నారు.

గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడితో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో వరుసగా ఇలాంటి ఘటన జరుగుతున్నాయని, దీంతో విద్యార్థిలు ప్రాణాలను పణంగా పెడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనతో గురుకులాలపై అధికారుల పర్యవేక్షణ, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..