Telangana: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన డెక్కన్ స్పోర్ట్స్ షాప్‌..

|

Jan 19, 2023 | 12:49 PM

Secunderabad Fire Accident: జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ షాప్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షాప్‌లో చెలరేగిన మంటలు ఎగసిపడుతున్నాయి.

Telangana: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన డెక్కన్ స్పోర్ట్స్ షాప్‌..
Secunderabad Fire Accident
Follow us on

జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ షాప్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షాప్‌లో చెలరేగిన మంటలు ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. కాగా, ఈ మంటల్లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా ప్రధాన రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు.

అగ్ని ప్రమాద దృశ్యాలు కింది వీడియోలో చూడొచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..