Summer Trains: ప్రయాణికులకు మరో శుభవార్త.. ఆ నగరాల మధ్య మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

|

Apr 28, 2022 | 11:23 AM

ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే(SCR) మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్-తిరుపతి నగరాల మధ్య 20 సమ్మర్ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్లు ప్రకటించింది....

Summer Trains: ప్రయాణికులకు మరో శుభవార్త.. ఆ నగరాల మధ్య మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
Tirupati Special Trains
Follow us on

ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే(SCR) మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్-తిరుపతి నగరాల మధ్య 20 సమ్మర్ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్లు ప్రకటించింది. 07509 నంబర్ గల ట్రైన్.. హైదరాబాద్(Hyderabad)-తిరుపతి మధ్య ఈ నెల 30 నుంచి ప్రతి శనివారం నడవనుంది. ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 07510 నంబర్ గల రైలు.. తిరుపతి-హైదరాబాద్ మధ్య మే 3వ తేదీ నుంచి ప్రతి మంగళవారం నడవనుంది. ఈ రైలు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో సేవలందించనుంది. ఈ ట్రైన్ తిరుపతి(Tirupati) లో రాత్రి 23.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 07511గల ట్రైన్.. తిరుపతి-ఔరంగాబాద్ మధ్య ప్రతి ఆదివారం వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 1, 8, 15, 22, 29 తేదీల్లోగా నడవనుంది. 07512నంబర్ గల రైలు.. ఔరంగాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ప్రతీ సోమవారం మే 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఔరంగాబాద్(Aurangabad) లో రాత్రి 23.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు రాత్రి 22.20 గంటలకు తిరుపతి చేరుతుంది.

07509/07510 నంబర్ గల రైళ్లు.. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగండ్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. 07511/07512 రైళ్లు.. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ, జాల్నా తదితర స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

Elon Musk: మరో సంచలన ప్రకటన చేసిన ఎలన్‌ మస్క్‌.. కోకాకోలాను కొని కొకైన్‌ను కలుపుతానంటూ ట్వీట్‌..

India Coronavirus: ఫోర్త్ వేవ్ అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..?