మరువలేనివి మారుతీరావు సేవలుః సీఎం కేసీఆర్‌

|

Dec 12, 2019 | 7:59 PM

నటుడు గొల్లపూడి మారుతీరావు మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. తెలుగు సినిమా రంగానికి గొల్లపూడి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. గొల్లపూడి రచనలు తెలుగు భాషా అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని గుర్తుచేశారు. గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారని అన్నారు. సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పారు. ఆయన […]

మరువలేనివి మారుతీరావు సేవలుః సీఎం కేసీఆర్‌
Follow us on

నటుడు గొల్లపూడి మారుతీరావు మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. తెలుగు సినిమా రంగానికి గొల్లపూడి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. గొల్లపూడి రచనలు తెలుగు భాషా అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని గుర్తుచేశారు. గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారని అన్నారు. సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు తీవ్ర సంతాపం తెలిపారు.