Hyderabad: బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగ్ చెక్ చేయగా… ఓర్నీ

చాక్లెట్లను ఇష్టంగా తినడం చిన్న పిల్లలకుండే వీక్‌నెక్. ఆ బలహీనతనే సాధనంగా చేసుకుని వాళ్లను మత్తుకు బానిసలుగా మార్చడం అనేది ఒక కొత్తతరహా నేరం. తల్లిదండ్రులకు, సమాజానికి ఇదొక ఛాలెంజ్‌గా మారుతోంది. వాటిని కొని తింటున్న పిల్లలు వింతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు.

Hyderabad: బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగ్ చెక్ చేయగా... ఓర్నీ
Hyderabad Police (Representative image)
Follow us

|

Updated on: Jun 17, 2024 | 9:23 PM

అస్సలు మాట వినడం లేదు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకు దొరికి జైళ్లకు వెళ్లి వచ్చి కూడా బుద్ది మార్చుకోవడం లేదు. మళ్లీ అక్రమ దందాకు పూనుకుంటున్నారు.  ఈ మధ్య గంజాయిని చాక్లెట్ల రూపంలో అమ్మడం ట్రెండింగ్‌గా మారింది. ఆశా చాక్లెట్, న్యూట్రిన్ చాక్లెట్, క్యాడ్‌బరీ చాక్లెట్‌లాగే గంజాయి చాక్లెట్‌ కూడా మార్కెట్‌లో ఈ మధ్య కనిపిస్తుంది. గంజాయితో తయారైన మాయదారి చాక్లెట్ ముక్కలివి. చాక్లెట్టే కదా అని ఓపెన్ చేస్తే… లోపల నల్లటి పదార్థం.. గుప్పుమన్న గంజాయి వాసన. ఒక్కో చాక్లెట్ ధర మినిమమ్ 15 రూపాయలు. మాగ్జిమమ్ 30 రూపాయలు.  మొదట్లో ఫ్రీగానే ఇచ్చి తియ్యటి మాటలతో చిన్నపిల్లల్ని మచ్చిక చేసుకుంటారు.. వాళ్లు కొద్దికొద్దిగా బానిసలుగా మారాక.. పైసలిస్తేనే చాక్లెట్లంటూ కౌంటర్లు తెరుస్తారు.  మత్తు చాక్లెట్లు తయారుచెయ్యడం, తెలిసిన వాళ్లకి మాత్రమే అమ్మడం, స్కూల్స్, కాలేజీల దగ్గర పాన్‌ డబ్బాలే అడ్డాలుగా చిన్నపిల్లలే టార్గెట్‌గా అమ్మకాలు జరపడం.. ఇలా కల్చర్ ఇప్పుడు గుబులు రేపుతోంది.

తాజాగా  ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లను శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ ప్రాంతంలో ప్రతి శనివారం జరిగే పార్టీలపై ఎక్సైజ్‌ పోలీసులతో కలిసి డ్రగ్ టాస్క్‌ఫోర్స్ బలగాలు సోదాలు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బైక్‌పై గంజాయి చాక్లెట్స్‌ తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.7 లక్షలు విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోన్న దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Ganja

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..